Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మల్హర్రావు
విద్యార్థుల ఆరోగ్యమే లక్ష్యంగా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఆరోగ్యశాఖలో చేప డుతున్న పలుచర్యలు చేపడుతున్నారు. వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించేందు కు వివిధ రకాలటీకాలు ఆరోగ్య కేంద్రాల్లో అందిస్తోంది.ఇందులో భాగంగా ధను ర్వాతం,గొంతువాపుబారిన పడకుండా 5 నుంచి 10 తరగతి చదువుతున్న, 10 నుంచి 16 సంవత్సరాలు కలిగిన విద్యార్థులందరికీ టిడి (టేటనస్, దీప్తిరియా) టీకాలు ఈనెల 19వరకు వేసేందుకు జిల్లా వైద్య శాఖ అధికారులు ఏర్పాట్లు చేశా రు. ఈ కార్యక్రమాని మండల కేంద్రమైన తాడిచెర్ల ప్రభుత్వ ప్రాథమిక వైద్యాధికా రి దీపక్ ఆధ్వర్యంలో ఇటీవల ప్రారంభించి శనివారం వరకు 100 శాతం పూర్తి చేసినట్లుగా చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు టీకా తీసుకోవడం ఎంతో ముఖ్యమని అప్పుడే పుట్టిన పిల్లల నుంచి యుక్త వయస్సు వచ్చే వరకు వ్యాధి నిరోధక శక్తి పెంపొందించడానికి పని చేస్తుందంటున్నారు. టెటనస్ వ్యాధి ప్రమాదకరమైనదని, తీవ్రమైన జ్వరం,అధిక రక్తపోటు, కండరాల నొప్పులు, తరచుగా చెమటలు పట్టడం,శ్వాస తీసుకోవడం ఇబ్బందులు ఎదురవుతాయన్నా రు. కంటసర్పి వ్యాధివల్ల గొంతువాపు, గొంతులోని టాన్సిల్స్ కింది భాగంలో ఉబ్బ డం, మెదడు వాపు, తినడానికి ఇబ్బందులు తదితర లక్షణాలు ఉంటాయన్నారు. మండలంలో మొత్తం ప్రభుత్వ పాఠశాలల్లో 5 నుంచి 10 తరగతి వరకు 840 మంది విద్యార్థులు ఉండగా, 5వ తరగతి విద్యార్థులు 234, 10వ తరగతి లోపు 256 మంది అర్హులుగా గుర్తించి సిబ్బందితో వ్యాక్సిన్ పూర్తిచేసినట్లు తెలిపారు.