Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తాడ్వాయి
కాంగ్రెస్ పార్టీ అభివద్ధి కోసం ప్రతి కార్యకర్త ఒక సైనికుల పని చేయాలని, రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని వచ్చే ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలిపించి ప్రజలు ఆశీర్వదించాలని ములుగు ఎమ్మెల్యే డాక్టర్ సీ తక్క అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో మం డల అధ్యక్షుడు అనంతరెడ్డి అధ్యక్షతన విస్తతస్థాయి కార్యకర్తల సమావేశంనిర్వహించారు.ఈసంద ర్భంగా ఏఐసిసి కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే డాక్టర్ సీతక్క మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర కళను నెరవేర్చింది సోనియమ్మని, భారతదే శానికి కుల, మత, ప్రాంత విద్వేషాలు లేకుండా ఆర్థిక అసమానతలు తొలగించి దేశాన్ని అభివృద్ధి వైపు నడ పడమే కాంగ్రెస్ పార్టీ ము ఖ్య ఉద్దేశం అన్నారు. ఉద్య మంలో ఉన్నప్పుడు ప్రజల కొరకు ఏ విధంగా పనిచే శానని కాంగ్రెస్ పార్టీలో కూడా ప్రజల గురించి ఈ కార్యకర్తల గురించి నిరంతరం పనిచేస్తున్నానని అ న్నా ారు. తెలంగాణ ప్రభుత్వం అధికారంలో ఉన్న ఒకమంత్రి, ఎమ్మెల్యే ఉన్న నియోజకవర్గంలో అభివద్ధి ఏ విధంగా ఉందో అదే స్థాయిలో ములుగు నియోజ కవర్గంలో పోరాడి అభివద్ధిని సాధిస్తున్నామని అన్నా రు. దళిత బంధు అర్హులందరికీ చెందే విధంగా కషి చేస్తానన్నారు. కాంగ్రెస్ పార్టీకి అభివద్ధికి కార్యకర్తలే మూలాలు అన్నారు. ఈ కార్యకర్త ఒక సైనికుల పార్టీని కాపాడాలని. ఎల్లప్పుడూ కంటికి రెప్పలా కా పాడుకుంటానని తెలియజేశారు. నాడు దళిత ముఖ్య మంత్రి చేస్తానని దళితులకు మూడెకరాల భూమి అని, కేజీ టు పీజీ అని, ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి అనేఎన్నికల హామీలన్నిటిని తుంగలో తొక్కారని ధ్వజమెత్తారు.ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మెజార్టీగా గెలి పించాలని, కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రజలు సరైన బుద్ధి చెప్పాలనిచ్చారు. ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ పులిసంపత్గౌడ్, మాజీ జెడ్పిటిసి బల్లు విజ య దేవేందర్, స్థానిక సర్పంచ్ ఇర్ప సునీల్ దొర, కా మారం సర్పంచ్ రేగ కళ్యాణి, ఏటూర్ నాగారం కాం గ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వెంకన్న, మంగపేట మండల అధ్యక్షుడు జయరాం, మండల అధ్యక్షుడు వావిలాల రాంబాబు, జిల్లా సీనియర్ నాయకుడు ల చ్చుపటేల్, సీతక్క యువసేన మండలాధ్యక్షుడు చర్ప రవీందర్, మాజీ ఎంపీపీ ఎనగంటి రామయ్య, యూ త్ నాయకులు కోడి సతీష్, మాజీ సర్పంచ్ ముజా ఫర్ హుస్సేన్, ఇందారపు లాలయ్య, మండలంలోని కాంగ్రెస్పార్టీ మహిళా నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.