Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే చల్లా దీవెనలతో కుటుంబం సంతోషం
- టెంట్ హౌస్ నిర్వాహకుడు బట్టు రవి
నవతెలంగాణ- పరకాల
రాష్ట్ర ప్రభుత్వం దళితులు ఆర్థికంగా అభివద్ధి చెందాలన్న ఆకాంక్షతో సీఎం కేసీఆర్ దళితబంధు పథకానికి శ్రీకారం చేపట్టి దళితుల అభ్యున్నతికి భరోసాగా పది రూ.10లక్షల ఆర్థిక సహాయం అంది స్తున్నారు. ఇలా ఒక్కో యూనిట్‌తో ఒక్కో కుటుంబానికి దళితబంధు ఆర్థిక సహాయం అందించడంలో హుజురాబాద్ అనంతరం పరకాల నియోజకవర్గరలో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పరకాల పట్టణంలో 25 మందికి రెండో విడతగా దళిత బంధు సాయం అం దించి దళితుల అభివృద్ధికి బాటలు వేశారు. ఎమ్మెల్యే ఆశీస్సులే దీవెనలుగా దళితబంధు పొందిన బట్టు రవి జులైలో పట్టణంలోని అంబేద్కర్ సెంటర్ సమీపంలో నాగశ్రీ టెంట్ హౌస్ ఏర్పాటు చేశాడు. తద్వారా శుభకార్యాలకు, వివాహ శుభాది కార్యక్రమాలకు, ప్రజాప్రతినిధుల కార్యక్రమాలకు, అశుభ కార్యాలకు టెంట్ హౌస్ సామాగ్రిని సేవా దృక్పథంతో తక్కువ ధరకు అందిస్తున్నాడు. అలాగే అతని కుటుంబ పోషణకు ఉపాధిగా మారింది. వచ్చే ఆదాయం తో కుటుంబం సంతోషంగా ఉఉంటోందని నిర్వాహకుడు బట్టు రవి పేర్కొన్నారు. దళిత బంధు పొందిన ప్రతివారు అభివద్ధిలో భాగస్వాములు అయ్యేందుకు యూనిట్ల ఎంపిక ఎంతో తోడ్పాటనందిస్తుందని చెప్పారు. కిరాణం, మొబైల్ షాపు,బట్టల షాపులు, ఆటోమొబైల్స్ ,కార్లు, ట్రాక్టర్లు ,టాటా గూడ్స్ వాహనాలతో పాటు మెడికల్ షాపులు, ఫుట్‌వేర్ తదితర వాటితో ఆర్థిక అభివద్ధి సాధించేందుకు తోడ్పాటందిస్తుందన్నారు. వినియోగదారులకు కూడా తనవంతు సహాయాన్ని అందిస్తూ, తనూ ఆర్థిక అభివద్ధి చెందుతున్నానని హర్షం వ్యక్తం చేస్తున్నాడు. తన అభివద్ధికి కారణమైన ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి దంపతుల ఆశీస్సులతో టెంట్ హౌస్ మరింత అభివద్ధి చెందేందుకు స్థానిక ప్రజాప్రతినిధుల సహాయ సహకారాలతో ముందుకెళ్తానని బట్టు రవి తెలిపారు.