Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పీఆర్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అంజిరెడ్డి
- హనుమకొండ, జనగామ, ములుగు జిల్లాల కార్యవర్గం ఎన్నిక
నవతెలంగాణ-ఖిలా వరంగల్
హనుమకొండ, జనగామ, ములుగు జిల్లాల నూతన కార్యవర్గాలు ఉపాధ్యాయుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేయాలని పీఆర్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారడ్డి అంజిరెడ్డి తెలిపారు. ఆదివారం హనుమకొండ నగరంలో పీఆర్టీయూ తెలంగాణ ఉమ్మడి వరంగల్ జిల్లా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మూడు జిల్లాల కమిటీలను ఎన్ను కున్నారు. ఎన్నికల అధికారిగా జయశంకర్ భూ పాలపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి రాచర్ల శ్రీని వాస్ వ్యవహరించారు. ఈ కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. 317జీవోలో భాగంగా వివిధ జిల్లాలకు ఉపాధ్యాయులు బదిలీ కావడం వల్ల వారి స్థానంలో తిరిగి కొత్త కార్యవర్గాలను ఎన్నుకున్నట్టు చెప్పారు. త్వర లోనే ప్రమోషన్లతో కూడిన బదిలీల షెడ్యూల్ వస్తుందని, ఆదిశగా ప్రయత్నం చేస్తున్నామని ఉపాధ్యాయులకు తెలియజేశారు. పూర్తిస్థాయి లో పాత పెన్షన్ విధానాన్ని అమలు చేసే విధం గా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించే దిశగా ప్రయ త్నాలు కొనసాగుతున్నాయన్నారు. అనంతరం నూతన జిల్లాల కార్యవర్గాలను ప్రకటించి అభినందనలు తెలిపారు. హనుమకొండ జిల్లా అధ్యక్షుడిగా కోతులనడుమ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రావులకార్ వెంకటేష్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ప్రధానకార్యదర్శిగా భీమోజు రాజేశ్వరయ్యచారి కొనసాగుతున్నారు. జనగామ జిల్లా అధ్యక్షుడిగా కొయ్యడ సురేం దర్, ప్రధానకార్యదర్శిగా మరికుక్కల యాద గిరిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ములుగు జిల్లా అధ్యక్షుడిగా వాంకుడోత్ జ్యోతి, ప్రధాన కార్యదర్శిగా తాడిచెర్ల రవిని ఏకగ్రీవంగా ఎన్ను కున్నారు. నూతనంగా ఎన్నికైన మూడు జిల్లాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షులు చెన్నయ్య, గౌరవాధ్యక్షుడు పర్వతి సత్యనారాయణ, రాష్ట్ర ప్రచారకార్యదర్శి మన్నె చంద్రయ్య, రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి చంద్రశేఖర రావుకు ధన్యవాదాలు తెలిపారు.