Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బయ్యారం
మండల కేంద్రంలో కాళోజి నారాయణ రావు 20వ వర్ధంత్ణిని పీడీఎస్యూ ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. కాలేజీ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పిం చారు. ఈ సందర్భంగా జిల్లా కన్వీనర్ బానోత్ దేవేందర్ మాట్లాడుతూ...రాజకీయ సాంఘిక చైతన్యాల సమాహారం కవిత్వం రాసిన ప్రజా కవి, హక్కులు అడిగిన ప్రజల మనిషి, కాళోజి అన్నారు. జీవితమంతా తెలంగాణ కిచ్చిన మహనీయుడని అన్నారు. నిజం దమన నీతికి నిరంకుశత్వానికి ఆచారక పాలనకి వ్యతిరేకంగా అతను తన కలం ఎత్తారని, స్వాతంత్ర సమరయోధుడని 1992లో భారత దేశ రెండో అత్యున్నత పౌర పురస్కారం పద్మభూషణ్ అవార్డు పొందారని అన్నారు. ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యునిగా 1958 నుండి 19 60 వరకు పనిచేశారన్నారు. ఆంధ్ర సరస్వత పరి షత్ వ్యవస్థపక సభ్యుడుగా ఆంధ్రప్రదేశ్ సాహి త్య అకాడమీలో సభ్యుడుగా తాను తెలంగాణ రచయితల సంఘం అధ్యక్షునిగా 1957-61 కాలంలో గ్లోరీ కమిటీ సభ్యునిగాను ఉన్నారని పేర్కొన్నారు. కాలోజీ మరాఠీ, ఇంగ్లీష్, ఉర్దూ భాషలలో పండితుడుగా ఎన్నో ఇతర భాషల గ్రంథాలను తెలుగులోకి అనువదించిన గొప్ప వ్యక్తి కాళోజీ అని కొనియాడారు. కాళోజి ఆశయ సాధనకై ప్రతి ఒక్కరూ ప్రతిమ పూనాలని ఈ ప్రజావ్యతిరేక పాలన పై రాజీలేని పోరాటాలు నిర్వహించాలని అప్పుడే కాలోజీ నారాయణరావుకి మనమిచ్చే నిజమైన ఘన నివాళి అని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు దిలీప్, వీరన్న, సాయి, ప్రవీణ్, సిద్దు, గణేష్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.