Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జనగామ జిల్లా మీడియా ఇన్చార్జిగా చింతకింది కృష్ణమూర్తి ప్రమాణస్వీకారం
నవతెలంగాణ-రఘనాథపల్లి
పద్మశాలి చేనేత కార్మికులు సమిష్టిగా కృషి చేస్తూ ఆర్థికంగా, రాజకీయంగా ఉన్నత స్థాయికి ఎదగాలని, అన్ని రంగాల్లో రాణించా లని జాతీయ చేనేత ఐక్యవేదిక రాష్ట్ర కమిటీ అ ధ్యక్షులు రాపోలు వీర రామ్మోహన్ పిలుపుని చ్చారు. ఆదివారం అఖిలభారత పద్మశాలి సంఘం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం లోని అన్నదాన సత్రంలో రాష్ట్ర కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రఘునాథ్‌పల్లి మండల కేంద్ర మీడియా ప్రతినిధిగా సీనియర్ జర్నలిస్టు చింత కింది కష్ణమూర్తి పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్బంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ భవిష్యత్తులో గ్రామ గ్రామాన పద్మశాలి సంఘా న్ని బలోపేతం చేస్తామన్నారు. మండల కమి టీలు, జిల్లా కమిటీ లు ఏర్పాటు చేస్తామన్నారు. త్వరలో జనగామ జిల్లా విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటుకు ప్రణాళిక సిద్ధం చేస్తానని చెప్పారు. రాజకీయాలకు అతీతంగా రానున్న ఎన్నికల్లో పద్మశాలి కులస్తులు చేనేత కార్మికులు ముందుకు వచ్చి అవకాశం ఉన్నచోట పోటీ చేయాలని విజ్ఞప్తి చేశారు. భవిష్యత్తులొ సబ్సిడీ తో పాటుగా రాజరికం కూడ భాగం కావాలని అని ఆయన కోరారు.