Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పార్టీ అభివృద్ధి కోసమా...?
- నియోజకవర్గ అభ్యర్థుల కోసమా..?
- పార్టీ నాయకుల్లో గుబులు !?
నవతెలంగాణ-నెల్లికుదురు
మహబూబాబాద్ నియోజకవర్గంలోని నాలుగు మండలాలు నెల్లికుదురు, కేసముద్రం, గూడూరు మహబూబాబాద్ మండల స్థాయి ముఖ్య కార్యకర్తల సీక్రెట్ సమావేశం నెల్లికుదురు మండల కేంద్రంలోని ఓ తోటలో డీసీసీ జిల్లా ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఏదెల్ల యాదవరెడ్డి ఆధ్వర్యంలో జరిగినట్టు సమాచారం. ప్రస్తుతం ఇది మండలంలో హాట్ టాపిక్‌గా మారడమే కాకుండా పార్టీ కార్యకర్తలోనూ గుబులు రేకెత్తి స్తోందని తెలిసింది. ఈ సమావేశం ఎటు దారి తీస్తుందోనని కార్యకర్తల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని పలువురు పేర్కొంటున్నారు. మహబూబాబాద్ నియోజక వర్గంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేసేందుకా ? పార్టీని విచ్ఛిన్నం చేసేందుకా ? అనే చర్చ కొంతమంది కార్యకర్తల్లో సాగు తోందనే ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్ర స్థాయి లోనూ ఈ సీక్రెట్ సమావేశం ఎలాంటి ప్రభావం చూపు తుందోనని గుబులు చెరదుతున్నట్టు తెలిసింది. కాంగ్రెస్ పార్టీ మహుబా నియోజకవర్గస్థాయిలో ఏ అభ్యర్థికి పార్టీ టికెట్ ఇస్తారు ? ఎమ్మెల్యేగా నియోజకవర్గస్థాయిలో ఎవరు దూసుకుపోతారోనన్న చర్చలు జరిగినట్టు తెలిసింది. ఏ అభ్యర్థికి టికెట్ వచ్చినా కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తలు ఐక్యంగా అభ్యర్థి గెలుపునకు సహకరిస్తారా ? లేదా అనే విషయంపై కూడా చర్చలు సాగుతున్నాయని కార్యకర్తలు పేర్కొంటున్నారు. ఏ అభ్యర్థి ప్రజల మధ్యలో ఉంటూ ప్రజా సమస్యలు పట్టించుకుంటూ పార్టీ గెలుపునకు ఎవరు కృషి చేస్తారో ? నని ఆరా తీసినట్టు సమాచారం. కాగా ఈ సీక్రెట్ సమావేశం అంతుపట్టడం లేదు. అలాగే నియోజకవర్గస్థాయిలో వర్గపోరు దేనికి దారి తీస్తుందోన్న చర్చ కూడా సాగుతోందని తెలిసింది. అలాగే పార్టీ గ్రామ స్థాయి సమన్వయకర్తలు కూడా సీక్రెట్సమావేశంపై సమా లోచనల్లో పడినట్టు అభిప్రాయాలు వ్యక్తమవుతు న్నాయి. ముఖ్యంగా నియోజకవర్గ స్థాయిలో టికెట్ కోసం ఆశించే వారు గతంలో కేంద్ర మంత్రిగా పనిచేసిన పోరిక బలరాం నాయక్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు డాక్టర్ మురళి నాయక్, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఆదివాసి హక్కుల జాతీయ అధ్యక్షుడు బెల్లయ్య నాయక్, గతంలో కాంగ్రెస్ పార్టీలో మహిళా జిల్లా అధ్యక్షులుగా పని చేసు కుంటూ నేటి వరకు వస్తున్న నునావత్ రాథా టికెట్ ఆశిస్తు న్నట్టు కార్యకర్తలు తెలుపుతున్నారు. ఇది ఇలా ఉండగా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు సీనియర్ నాయకుడు జన్నారెడ్డి భరత్ చంద్రారెడ్డి కూడా లైన్లో ఉండగా రిజర్వేషన్ కు అనుకూలంగా లేకపోవడంతో కార్యకర్తల్లో చర్చ జరుగుతున్నట్టు ఊహాగానాలు వెలువడుతున్నాయి. నెల్లికుదురు మండలం కార్యకర్తలు మహబూబాబాద్ నియో జకవర్గస్థాయిలో జెండా ఎగరేసేందుకు ముఖ్య నాయకు లుగా వ్యవహరిస్తారా ? అనే చర్చ కూడా సాగుతోంది. ఈసారి నియోజకవర్గస్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే టికెట్ వన్ సైడ్ చేసి మహబూబాద్ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరవేసేందుకు కాంగ్రెస్ నాయకులు పనిచేస్తున్నారని సమాచారం. అధిష్టానం నియోజకవర్గ స్థాయి లీడర్లను ఏకం చేసి ఒకరికి టికెట్ ఇచ్చి గెలుపు దిశగా వర్గపోరు లేకుండా పోవడానిక హైకమాండ్ కషి చేస్తున్నట్లు ఊహా గానాలు కూడా ఉన్నాయని కార్యకర్తలు తెలుపుతున్నారు.