Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గార్ల
69వ జాతీయ సహకార దినోత్సవ వేడుకలను స్థానిక పీఏసీఎస్ కార్యాలయంలో సోమవారం ఘనం గా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం జెండా ను పీఏసీఎస్ చైర్మన్ వడ్లమూడి దుర్గా ప్రసాద్ ఆవి ష్కరించి మాట్లాడారు. సహకార సంఘం ద్వారా రైతు లకు మరిన్ని సేవలు అందించేందుకు సంఘం సిద్ధం గా ఉందని అన్నారు. రైతులు నేరుగా సంప్రదించి సేవలను పొందాలని కోరారు. ఈ నెల 14-20వరకు జరిగే సహకార వారోత్సవాలను జయప్రదం చేయా లని కోరారు. వైస్ చైర్మన్ గంగావత్ లక్ష్మణ్ నాయక్, డైరెక్టర్లు ఎస్ ప్రవీణ్ కుమార్, ఎ.వెంకటేశ్వర్లు, ఎన్.శ్రీనివాస్, వై.వెంకటేశ్వరరావు, పి.వెంకటేశ్వర్లు, సీఈఓ సింగు వెంకటేశ్వర్లు, తదితరులు ఉన్నారు.
కేసముద్రం రూరల్ : రైతులు, సంఘ సభ్యుల పరస్పర సహకారంతో సంగం అభివద్ధి సాధిస్తుందని కేసముద్రం సొసైటీ చైర్మన్ దికొండ వెంకన్న అన్నారు. సహకార వారోత్సవాలను పురస్కరించుకుని సోమ వారం కేసముద్రం సొసైటీ కార్యాలయం వద్ద సహ కార పతాకాన్ని సొసైటీ చైర్మన్ వెంకన్న ఆవిష్క రించారు. వైస్ చైర్మన్ అంబటి మహేందర్ రెడ్డి, డైరెక్టర్లు శేషగాని సుధాకర్, బీరం గోపాల్ రెడ్డి, గుగు లోతు రాంజీ, కాలేరు లక్ష్మణ్, మర్రి యాకన్న, బొద్దు లక్ష్మి సిబ్బంది సురేష్, రమేష్, సౌజన్య పాల్గొన్నారు.
లింగాలగణపురం : ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సొసైటీ వారోత్సవాలు సోమవారం మండల కేంద్రంలోని కార్యాలయం ఆవరణలో పీఏసీఎస్ చైర్మెన్ మల్గ శ్రీశైలం ప్రారంభించారు. కోపరేటివ్ సభ్యులు సిబ్బంది పాల్గొన్నారు.
నెల్లికుదురు : 69వ జాతీయ సహకార దినోత్సవం ఘనంగా నిర్వహించినట్లు ఎంపీపీ ఎర్ర బెల్లి మాధవినవీన్రావు, ఎర్రబెల్లిగూడెం పీఏసీఎస్ చైర్మెన్ పొనుగోటి దేవేందర్‌రావు, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు బత్తిని అనిల్‌గౌడ్ తెలిపారు. సోమవారం మండలంలోని ఎర్రబెల్లిగూడెం ప్రాథమిక సహకార సంఘం పరిధి డైరెక్టర్లతో కలిసి జెండా ఆవిష్కరించారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అభివద్ధికి ప్రత్యేక కషి చేయాలని కోరారు. ప్రభుత్వం ద్వారా వచ్చే ఎలాంటి పథకాలైన అందిం చేందుకు తమ వంతు కృషి చేస్తున్నామని అన్నారు. సంఘం డైరెక్టర్లు కొయ్యేడి వెంకటేశ్వర్లు, బిలావత్ బాలు, గుగులోతు.శ్రీను, జెర్రిపోతుల వెంకటయ్య, సంఘం సీఈఓ సుభాష్ పాల్గొన్నారు.