Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి రంజిత్‌కుమార్
నవతెలంగాణ-జనగామ
అన్ని యాజమాన్యాల ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ తక్షణమే ప్రారంభించాలని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కానుగంటి రంజిత్ కుమార్ డిమాండ్ చేశారు. సోమవారం జిల్లా కేంద్ర కార్యాలయంలో పి చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన ఏర్పాటు చేసిన జిల్లా కమిటీ సమావేశంలో రంజిత్ కుమార్ మాట్లాడారు. వేసవి సెలవుల్లో చేస్తామని చెప్పి విద్యాసంవత్సరం ప్రారంభమై ఆరు నెలలు కావ స్తున్నా బదిలీలు చేపట్టకపోవడం శోచనీయమన్నారు. యుఎస్పీసీ ఆధ్వర్యంలో ఉధతమైన పోరాటాలు నిర్వహించినా ప్రభుత్వంలో చలనం లేదన్నారు. పాఠశాలల్లో వేలాది పోస్టులు ఖాళీగా ఉన్నాయని, ఉపాధ్యాయులు లేక విద్యార్థులకు నష్టం వాటి ల్లుతోందన్నారు. అర్హులైన ఉపాధ్యాయులకు ఏడేళ్ళుగా ఎదురు చూపులే మిగులుతున్నాయన్నారు. నూతన రాష్ట్రపతి ఉత్తర్వులకు అనుగుణంగా వివాదం లేని క్యాడర్ల వరకు బదిలీలు, పదోన్నతులు చేపట్టటా నికి ప్రభుత్వం ఎందుకు వెనకాడుతుందో చెప్పాల న్నారు. నవంబర్ నెలాఖరులోగా షెడ్యూల్ విడుదల చేయకుంటే డిసెంబర్లో మరోమారు పోరుబాట పట్టాలని యూఎస్పీసీ రాష్ట్ర స్టీరింగ్ కమిటీ నిర్ణయిం చినట్టు తెలిపారు. జీఓ-317 అమలు కారణంగా స్థానికత కోల్పోయిన ఉపాధ్యాయులను దశలవారీగా స్వంత జిల్లాలకు బదిలీ చేయాలని, 13 జిల్లాల భార్యాభర్తల బదిలీలను అనుమతించాలని కోరారు. ఇతర అప్పీల్స్ అన్నింటినీ సత్వరమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. పాఠశాలల్లో సర్వీస్ పర్సన్స్ నియమించాలన్నారు. ఉపాధ్యాయుల కొరత కారణం గా ఆంగ్ల మాధ్యమంతోపాటు ఎఫ్ఎల్ఎన్ అమలు తలకుమించిన భారంగా మారిందన్నారు. ఉపాధ్యా యులపై రాతపని, పర్యవేక్షణ ఒత్తిడి తగ్గించాల న్నారు. ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఆకుల శ్రీనివాసరావు, జిల్లా కార్యదర్శులు కందుల శ్రీనివాస్,మాడూరి వెంకటేష్, సుధీర్ రెడ్డి, జ్యోతి శ్రీహరి, సుధాకర్, జయప్రకాష్, వెంకటాద్రి, శ్రీనివాస్, మండలాల బాధ్యులు తదితరులు పాల్గొన్నారు.