Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి
నవతెలంగాణ-బుచ్చన్నపేట
అధికారులు సమన్వయంతో పనులు చేసినప్పుడే ప్రజలకు నష్టం జరగకుండా ఉంటుందని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. సోమవారం మండల సర్వసభ్య సమావేశం ఎంపీపీ భావన నాగజ్యోతి అధ్యక్షతన నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఆయన పాల్గొని మాట్లాడుతూ ప్రజలు తమ కష్టాలను చెప్పుకోవడానికి ప్రభుత్వ కార్యాలయాల్లోకి వస్తే వారి నుండి సమాచారం సేకరించి న్యాయం చేసినప్పుడే అధికారి తన విధులను సక్రమంగా నిర్వహించినట్లవు తుం దన్నారు. ఆదివారం మండలంలోని చిన్నరామచర్ల గ్రామంలో పలు అభి వృద్ధి పనులకు సంస్థాపన చేయడానికి వెళ్లిన ఆయనను గ్రామ ప్రజలు కొండెంగ బారి నుండి రక్షించాలని వేడుకోగా ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ తో ఫోన్లో మాట్లాడారు. సంబంధిత అధికారి విచక్షణ రహితంగా జవాబు ఇవ్వడంతో ఈరోజు జరిగిన మండల సర్వసభ్య సమావేశంలో ఆయనపై చర్యలు తీసుకోవడానికి ఏకగ్రీవ తీర్మానం చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రఘురామకృష్ణ, వివిధ గ్రామాల సర్పంచులు, అధికారులు పాల్గొన్నారు.