Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పాల్గొన్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు
నవతెలంగాణ-దేవరుప్పుల
బాల యేసు ఇంగ్లీష్ మీడియం పాఠశాల ఆధ్వర్యంలో బాలల దినోత్సవంను సోమవారం ఘనంగా నిర్వహించారు. స్థానిక మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ముఖ్య అతిథిగా పాల్గొని వివిధ రకాల సాంస్కతిక, స్వాతంత్య్ర సమరయోధుల వేషధారణలోని విద్యార్థులతో ముచ్చటింపజేశారు. అనంతరం విద్యార్థులకు చాక్లెట్లు పంపిణీ చేశారు. గ్రామీణ ప్రాంతంలో తమదైన శైలిలో ఉన్నత విద్యను అందిస్తున్న బాలయేసు పాఠశాల కరస్పాండెంట్ జేసురాజు సేవలను కొనియాడారు.బ్రదర్ జేసురాజు అహర్నిశలు విద్యార్థుల కోసం కషి చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్ర మంలో జెడ్పీ చైర్మన్ సంపత్ రెడ్డి, ఎంపీపీ బస్వ సావిత్రి టిఆర్ఎస్ నాయకులు పల్లా సుందరాంరెడ్డి,తీగల దయాకర్ బస్వ మల్లేష్, చింత రవి ఉపాధ్యాయులు మహ్మద్ ఖాజా పాషా, రమాదేవి, మహేష్, మధు తదితరులు పాల్గొన్నారు.
భవిష్యత్ తరాలకు ఆర్థిక పరిపుష్టిగా తయారు చేసుకోవాలి
బాలురు చిన్నతనం నుండి విద్యను అలంకారంగా తీసుకొని, వారి మేధా సంపత్తిని భవిష్యత్ తరాలకు ఆర్థిక పరిపుష్టిగా తయారు చేసుకోవాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. సోమవారం మండలంలోని కస్తూర్బా పాఠశాలలో నిర్వహించిన బాలల దినోత్సవంలో ఆయన పాల్గొని విద్యార్థులతో కేక్ కట్ చేసి విద్యార్థులకు పంచారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... పాఠశాలలో సమస్యలపై అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. విద్యార్థులు ఇక్కడున్న సౌకర్యాలను ఉపయోగించుకుని విద్యను అభ్యసించి ఉపాధ్యాయుల పేరును నిలబెట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బస్వ సావిత్రి, జెడ్పీ చైర్మన్ సంపత్‌రెడ్డి, సర్పంచ్ ఈదునూరి రమాదేవి, టీఆర్ఎస్ నాయకులు పళ్ళ సుందరరామిరెడ్డి, బస్వ మల్లేష్, తీగల దయాకర్, చింత రవి, తోటకూర కష్ణయ్య, మాచర్ల బాబు, కారుపోతుల బిక్షపతి, యాదగిరి, తిరుమలేష్ తదితరులు పాల్గొన్నారు.