Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు
నవతెలంగాణ-జనగామ
పుస్తక పఠనం ద్వారానే జ్ఞాన సముపార్జన సాధ్య మవుతుందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభి వృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. 55వ గ్రంథాలయ వారోత్సవాల్లో సందర్భంగా సోమ వారం జిల్లా కేంద్రంలోని జిల్లా గ్రంథాలయంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఎడవెల్లి కష్ణారెడ్డి అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ సంపత్‌రెడ్డి, కలెక్టర్ శివలింగయ్య, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, డీసీపీ సీతారాంతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేశా రు. అనంతరం మంత్రి మాట్లాడుతూ... సీఎం కేసీఆర్ పుస్తకాలు చదివే తెలంగాణ ఉద్యమానికి సారథ్యం వహించారన్నారు. ప్రతి మండల కేంద్రంలో లైబ్రరీ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. జనగామ జిల్లా కేంద్రంలో కొత్తగా సౌకర్యాలతో కూడిన జిల్లా గ్రంథాలయ నిర్మాణానికి చర్యలు తీసుకుంటామన్నా రు. ఇందుకు ప్రభుత్వం నుండి నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ప్రతి సంవత్సరం నవంబర్ 14 -20వ తేదీ వరకు వారం రోజుల పాటు జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు నిర్వహించుకుని పుస్తక పఠన ప్రాముఖ్యతను చాటి చెప్పాలన్నారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు అన్ని రకాల పుస్తకాలు అందిం చాలనే లక్ష్యంతోనే 1919లో అఖిల భారత ప్రజా గ్రంథాలయ అసోసియేషన్‌ను స్థాపించగా కాలక్రమేన ఇండియన్ లైబ్రరీ అసోసియేషన్‌గా మారిందని అన్నారు. గ్రంథాలయాలలో విజ్ఞానాన్ని పెంపొందిం పజేసుకుని ఉన్నత శిఖరాలకు చేరిన వారెందరో ఉన్నారని హితబోధ చేశారు. అనంతరం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి మాట్లాడుతూ జిల్లా గ్రంథా లయ నిర్మాణానికి పట్టణంలో స్థలం అందుబాటులో ఉందన్నారు. ఆ భూమిని జిల్లా అధికారులు గ్రంథాల య నిర్మాణానికి పరిశీలించి కేటాయించాలన్నారు.