Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 60 కేంద్రాలు షురూ..
- రవాణా టెండర్ల ఖరారులో జాప్యం..
నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి
హన్మకొండ జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు ఊపందు కుంటున్నాయి. వానాకాలం సీజన్లో 2 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోళ్లు చేయాలని నిర్ణయించారు. జిల్లా లోని కమలాపూర్, ఎల్కతుర్తి, భీమదేవరపల్లి, ధర్మసాగర్, హసన్పర్తి, వేలేరు మండలాల్లో ఇప్పటికే కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యాయి. 60 కేంద్రాలలో ధాన్యం కొనుగోళ్లు షురూ అయ్యాయి. రవాణాకు సంబంధించి టెండర్లు నేటికీ ఖరారు కాలేదు. 5 సెక్టార్లలో 2 సెక్టార్లలో గత కాంట్రాక్టర్లనే రవాణా చేయాలని కోరడంతో వారు స్పం దించి రవాణ చేయడానికి ముందుకు వచ్చారు. 50 లక్షల గన్నీ సంచులకుగాను కొత్తవి 16 లక్షలు, పాతవి 22 లక్షల సంచులున్నాయి. మరో 12 గన్నీ సంచులు జిల్లాకు అవ సరం. జిల్లాలోని 14 మండలాలను 5 సెక్టార్లుగా విభజించి రవాణాకు సంబంధించిన టెండర్లను పిలిచారు. టెండర్ల ఖరారులో తీవ్ర జాప్యం జరుగుతుంది. గతంలో రవాణా చేసిన గుత్తేదార్లతో 2 సెక్టార్లలో ధాన్యం రవాణ ప్రారం భించారు.
హన్మకొండ జిల్లాలో 14 మండలాల్లో ఇప్పటికే కమలాపూర్, ఎల్కతుర్తి, భీమదేవరపల్లి, హసన్పర్తి, వేలేరు, ఐనవోలు, ధర్మసాగర్ తదితర మండలాల్లో సుమారు 60 కొనుగోలు కేంద్రాలను అధికారులు ప్రారంభించారు. ఇందులో 21 ఐకెపి, 39 పీఏసీఎస్ కేంద్రాలున్నాయి. ఇప్పటి వరకు 21 కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు చేశారు. 607 మంది రైతుల నుండి 3,254 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. ఈ వానాకాలం సీజన్లో మొత్తం 161 కొనుగోలు కేంద్రాల్లో 2లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొను గోలు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు తొలి దశలో కమలాపూర్, ఎల్కతుర్తి, భీమదేవరపల్లిలో కొనుగోలు కేంద్రా లు ప్రారంభమయ్యాయి. నవంబర్ 7వ తేదీ నుండి జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించారు. పరకాల, శాయంపేట, ఆత్మకూరు, నడికూడ మండలాల్లో కొంత ఆలస్యంగా కోతలు ప్రారంభం కానున్నందునా కేంద్రాలను ఆలస్యంగా ప్రారం భించే అవకాశముంది. గత వానాకాలం సీజన్లో 1.51 లక్షల మెట్రాక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. గతంలో 151 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ సీజన్లో మరో 10 కేంద్రాలను పెంచడానికి ఏర్పాట్లు చేశారు.
రవాణా టెండర్లలో జాప్యం..
జిల్లాను 5 సెక్టార్ల కింద విభజించి ధాన్యం రవాణాకు టెండర్లు పిలిచారు. ఒక్కో సెక్టార్లో 30 వాహనాలను కేటా యించనున్నారు. మొత్తంగా 150 వాహనాలు అవసరం. ధాన్యం కొనుగోళ్లు ఊపందుకుంటున్న నేపథ్యంలో టెండర్లు ఖరారు కావడంలో జాప్యం జరుగుతుండడంతో పాత గుత్తే దార్లను రెండు సెక్టార్లలో రవాణా చేయాలని సూచిం చడంతో వారు ముందుకు వచ్చినట్లు అధికారులు చెబు తున్నారు. గత వానాకాలం సీజన్లో రవాణాకు సంబం ధించి వాహన కొరత తీవ్రంగా ఉండి రైతులు వ్యయప్ర యాసాలకు గురైన విషయం విదితమే. ఈ నేపథ్యంలో రవాణాకు సంబంధించి టెండర్లను త్వరితగతిన ఖరారు చేయాలని రైతులు కోరుతున్నారు.
మరో 12 లక్షల సంచులవసరం..
జిల్లాలో 2లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని తరలించ డానికి 50 లక్షల సంచులవసరముంది. ఇందులో కొత్తవి 16 లక్షలు, పాతవి 22 లక్షలు అందుబాటులో వున్నాయి. మరో 12 లక్షల గన్నీ సంచులు అవసరం. ఇందుకు అనుగుణంగా సివిల్ సప్లయిస్ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. త్వరలోనే మొత్తం గన్నీస్ సంచులు తెప్పించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.