Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ శ్రీ దేవసేన
నవతెలంగాణ-స్టేషన్‌ఘన్‌పూర్
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు - మన బడి ప్రణాళికతో ప్రభుత్వ పాఠశాల రూపు రేఖలు మారాయని రాష్ట్ర విద్యాశాఖ డైరెక్టర్ శ్రీ దేవసేన అన్నారు. మండలంలోని చాగల్ గ్రామంలో కలెక్టర్ శివ లింగయ్యతో కలిసి సోమవారం మండల ప్రజాపరిషత్ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసి పరిశీలించారు. తరగతి గతుల్లో టీచర్లు ముఖ్యంగా గణితం టీచర్ అమీర్, ఈవీఎస్ వేణు గోపాల్ విద్యా బోధన తీరు తెలుసుకుని సంతప్తి వ్యక్తం చేశారు. అనంతరం పాఠశాల పర్యావరణం, మరుగు దొడ్లు, మౌలిక సదుపాయాలను పరిశీలించారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చేపట్టిన అభివద్ధి పనుల్లో మరింత వేగం పెంచాలని సూచించారు. జిల్లాలో రూ. 30లక్షల లోపు అభివద్ధి పనులు చేపట్టిన 131పాఠశాలల్లో 48 పాఠశాలల్లో అభివృద్ధి పనులు పూర్తి కాగా, 83 పాఠశాలల్లో పనులు అభివద్ధి దశలో ఉన్నాయని తెలిపారు. ఇదే స్ఫూర్తితో మరో 20పాఠశాలలు లక్ష్యంగా పెట్టుకుని పనులు పూర్తికావచ్చినట్లు తెలిపారు. తల్లిదండ్రులు వారి పిల్లల్ని సర్కారు బడుల్లో చదివించేందుకు ఆసక్తి కనబరచాలని అన్నారు. అనేక మౌళిక సదుపాయాలు కల్పించి విద్యా ప్రమాణాలను మెరుగు పరిచేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. తొలిమెట్టు భాగంలో ఇంగ్లీష్ మీడియం విద్యను కూడా అందిస్తున్నట్లు తెలిపారు. గదులన్నిటికీ కూడా పేర్లు, విద్యు త్‌కు సంబంధించి, తదితర పనులన్నీ త్వరితగతిన పూర్తిచేయాలని సూచిం చారు. అదనపు కలెక్టర్ ప్రపుల్ దేశారు, డీఈఓ రాము, ఏఎంఓ శ్రీనివాస్, ఎంఈఓ భగవాన్, నోడల్ అధికారి అజామోయినుద్దీన్, హెచ్ఎం కొమురయ్య, సోమనారాయణ, ఎమ్మార్సి గిరి, తదితరులు పాల్గొన్నారు.