Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భూపాలపల్లి
జిల్లాలోని ప్రజావాణి వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు కుడుదుల వెంకటేష్ కోరారు. సోమవారం ప్రజావాణి సందర్భంగామహాదేవపూర్ మండలం కాలేశ్వరం గ్రామానికి సంబంధించిన వరద బాధితులు మేడిగడ్డ అన్నారం ప్రాజెక్టు కింద వరద ఉధతికి ఇండ్లన్నీ నేలమట్టం కాగా వారికి వరద సహాయం కింద ఆర్థిక సహాయం మరియు పునర్వాసం కల్పిం చాలని సిపిఐ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేసి కలెక్టర్ కార్యాలయంలో వినతిప త్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా వెంకటేష్ మాట్లాడుతూ.... కాటారం మండలం దామెర కుంట, ఒడిపిలవంచ గ్రామాలలో ఉన్న ఎస్సీ ఎస్టీ దళిత మహి ళలు ఎన్నో ఏళ్లుగా నివాసం ఉంటున్న ప్రభుత్వాలు మారిన ఏ ఒక్క సంక్షేమ పథకాలు కూడా అందలేదని కావున దళిత బంధు ఇవ్వాలని అలాగే డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలని కోరారు. భూపాలపల్లి మండలంలోని గుర్రంపేట గ్రామ నివాసులైన ఎస్టి నాయకపోడు గత 30 ఏళ్లుగా పోడు చేసుకున్న భూములకు సర్వే నిర్వహించి పోడుపట్టాలి ఇప్పించాలని అనేకమార్లు దరఖాస్తు చేసుకున్న ప్పటికీ పట్టాలు ఇవ్వకపోవడం విడ్డూరంగా ఉండాలి అన్నారు.పోడు సాగులో ఉ న్న వ్యక్తి ఒకరైతే సాగుకు సంబంధం లేని వ్యక్తులను తీసుకొచ్చి పోడు భూమిలో భూమికి సంబంధంలేని వ్యక్తిని తీసుకువచ్చి ఫోటోలు దింపుతున్నారని అధికారుల నిర్లక్ష్యం వల్ల సాగులో ఉన్న రైతందానికి అన్యాయం జరిగే అవకాశం ఉందన్నారు.
బినామీ పేర్లు పెట్టి అక్రమ పట్టాలు సంపాదించుకున్నటువంటి విధంగా కొంతమంది దళారీ వ్యక్తులు అసలైన లబ్ధిదారులకు న్యాయం జరగకుండా చూస్తు న్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. గుర్రంపేట లో జరుగుతున్న విషయాల న్నింటిని కలెక్టర్ దృష్టిలో పెట్టి వారికి వివరించడం జరిగిందని వెంకటేష్ అన్నారు కలెక్టర్ స్పందిస్తూ పోడు సాగు చేసుకుంటున్నా రైతాన్ గానికి అన్యాయం జరగ కుండా చూస్తామని హామీ ఇచ్చారని వారన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ సమ్మయ్య, నరేష్, దేవేందర్, కాజా, సమ్మయ్య, కొమరయ్య, బిక్షపతి, విజయలక్ష్మి, సరోజన , కవిత ,రజిత తదితరులు పాల్గొన్నారు.