Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ములుగు
గ్రంథాలయాలను నిరుద్యోగులు విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ పోరిక్ గోవింద్‌నాయక్ తెలిపారు. ములుగు జిల్లా గ్రంథాలయ కార్యాలయం ఆవరణంలో సోమవారం ఏర్పాటు చేసిన 55వ గ్రంథా లయ వారోత్సవాలకు లైబ్రేరియన్ సమ్మక్క అధ్యక్షత వహించగా ముఖ్య అతిథు లుగా సంస్థ చైర్మన్ పోరిక గోవింద్ నాయక్, సబ్ రిజిస్ట్రార్ తస్లీమా హాజరై ఘ నంగా ప్రారంభించారు. ముందుగా బాలల దినోత్సవ సందర్భంగా విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. గ్రంథాలయ పితామహుడు డాక్టర్ ఆర్ఎస్ రంగనాథన్ చిత్రా పటానికి పూలమాలవేసి జ్యోతిప్రజ్వలన చేశారు. అనంతరం గోవింద్ నా యక్ మాట్లాడుతూ జిల్లా ఏర్పడిన తర్వాత మొదటిసారిగా గ్రంథాలయం వారోత్స వాలు జరుపుకుంటున్న సందర్భంలో జిల్లా గ్రంథాలయ సంస్థ అభివృద్ధికి కృషి చేస్తానని జిల్లాలో ఉన్న అన్ని గ్రంధాలయాలను ఆధునికరించి పత్రికలను, పుస్తకా లను, ఉద్యోగ నియామకాలకు ప్రిపరేషన్ అవుతున్న నిరుద్యోగ అభ్యర్థులకు కూడా అన్ని రకాల మెటీరియల్ అందుబాటులోకి తెస్తామన్నారు.
సబ్ రిజిస్టర్ తస్లీమా మాట్లాడుతూ నేటి బాలలే రేపటి పౌరులని అన్నారు నాడు గ్రంథాలయాలలో చదువుకొని ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నాన్నారు. పాఠశాలలో కేవలము పాఠ్యపుస్తకాలు మాత్రమే ఉంటాయని కానీ గ్రంథాలయం లో అన్నిరకాల పుస్తకాలు, రచనలు, మహనీయుల జీవిత గ్రంథాలు కూడా ఉంటా యని విద్యార్థులకు తెలిపారు. ములుగు పట్టణానికి చెందిన దొంతి రెడ్డి శ్రీనివాస్ రెడ్డి తండ్రి దొంతి రెడ్డి భూపాల్ రెడ్డి స్మారకర్థం రూ.6వేల విలువ చేసే పుస్తకాలు అందిచారు.ములుగు ప్రభుత్వస్కూల్ విద్యార్థులు, సాధన, బ్రిలియంట్, సెంయిట్ ఆంథోనీస్ విద్యార్థులకు మొదటి రోజు చిత్రలేఖనం పోటీని నిర్వహించగా సుమారుగా 100 మంది విద్యార్థులు ఈ పోటీలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అబ్జర్వర్‌గా పోషాల వీరామల్లు,సాధన,బ్రిలియంట్,అరవింద, సెయింట్ ఆంథో నీస్ కరస్పాండెంట్లు కోటిరెడ్డి, సురేందర్ రెడ్డి,ఉమ, ఎంపిటిసి గొఱ్ఱె సమ్మయ్య, మేడారం బోర్డు డైరెక్టర్ శ్రీ సాని కొమ్ము ఆదిరెడ్డి,అత్మ మాజీ చైర్మన్ బైకని ఓదెలు, మండల బిసి సెల్ అధ్యక్షులు రాజా హుస్సేన్, ములుగు పట్టణ అధ్యక్షులు చెన్న విజరు,సీనియర్ నాయకులు చింతలపుడి నరేందర్‌రెడ్డి, గడ్డమీది భాస్కర్, మెరుగు సంతోష్, నేరేళ్ళ శంకర్, గుగ్గిల సాగర్ తదితరులు పాల్గొన్నారు.