Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిరుద్యోగులకు అండగా ఎంఆర్ఎం ట్రస్ట్ : ఎమ్మెల్యే గండ్ర
నవతెలంగాణ-భూపాలపల్లి
ఉద్యోగం సంపాదించడమే లక్ష్యంగా దేహదారు డ్య సాధన చేయాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. ఇటీవలే విడులదలైనా ఎస్సై, కానిస్టేబుల్. పరీక్షలలో ఉత్తీర్ణత సాధించిన 100 మంది అభ్యర్థులకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్లో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి జీఎంఆర్ఎం ట్రస్ట్ ద్వారా టీషర్టులు, లోయర్ డ్రెస్ మెటీరియల్స్ అం దించి, జీఎంఆర్ఎం ట్రస్ట్ ఆద్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత దేహదారుఢ్య శిక్షణ శిభిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ జిల్లాలోని పేద,మధ్యతరగతి, నిరుద్యో గ యువతీ యువకులకు జీఎంఆర్ఎం ట్రస్ట్ ఎల్లప్పు డూ అండగాఉంటుందన్నారు. ఎస్సై, కానీస్టేబుల్ రా తపరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు అనుభవం, అంకి తభావం కలిగిన కోచ్‌ల చేత దేహదారుడ్య శి క్షణ ఉచి తంగా ఇప్పిస్తున్నామని, అభ్యర్థులు ప్రతి రోజు క్రమం తప్పకుండా దేహదారుడ్య శిక్షణా కేంద్రానికి హాజరై కఠోరమైనా సాధన చేయా లన్నారు. శిక్షణకు వచ్చే అ భ్యర్థులకు ప్రతి రోజు ఉచి తంగానే పౌష్టి కాహారాన్ని అందజేస్తూ శిక్షణ ఇస్తామ న్నారు. ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులు కోచ్ చెప్పిన మె ళకువలు ఓపికతో వింటూ శిక్షణ పొంది జీఎంఆర్ఎం ట్రస్టుకు మంచిపేరు తీసుకురావాలన్నారు. అనంత రం శిక్షణపొందే అభ్యర్థులకు పాలు, బ్రెడ్, అరటిపం డ్లు,గుడ్లుఅందజేశారు. ఈ కార్యక్రమంలో భూపాలప ల్లి మున్సిపల్ చైర్ పర్సన్ సెగ్గం. వెంకటరాణి సిద్ధు, వైస్ చైర్మెన్ కొత్త హరిబాబు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మెన్ బుర్ర రమేష్, టీఆర్ఎస్ భూపాలపల్లి అర్భన్ అధ్యక్షుడు కటకం జనార్ధన్, పీఏసీఎస్ చైర్మెన్ మేకల సంపత్ కుమార్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ గండ్ర హరీ ష్‌రెడ్డి, మాజీ ఎంపీపీ కళేపు రఘుపతిరావు, కౌన్సిల ర్లు మేకల రజీత మల్లేష్, నూనె రాజు పటేల్, శిరుప అనిల్,ముంజాల రవీందర్‌గౌడ్, మంగళపెల్లి తిరుప తి, ముంజంపెల్లి మురళీధర్, హనుమాన్ టెంపుల్ చైర్మెన్ కుమార్‌రెడ్డి, కో-ఆప్షన్ మెంబర్లు ఇర్ఫాన్, టీ ఆర్ఎస్ నాయకులు బీబీచారి, జాగరి అజరు యాద వ్, సింగనవేణి చిరంజీవియాదవ్, కరీం, శ్రీకాంత పటేల్, రాజీరెడ్డి, ప్రేమ్ కుమార్, ముత్తు, బాణాలు దేవేందర్, రాజ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.