Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ములుగు జిల్లా కలెక్టర్ ఎస్.కృష్ణ ఆదిత్య
నవతెలంగాణ-ములుగు
జిల్లాలో క్షేత్రస్థాయిలో నిర్వహిస్తున్న పోడు భూ ముల సర్వే గ్రామసభ సమర్థవంతంగా నిర్వ హించా లని జిల్లా కలెక్టర్ ఎస్.కృష్ణ ఆదిత్య అధికారులను ఆ దేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మంది రంలో జిల్లా కలెక్టర్ ఐటీడీఏ పీవో అంకిత్, డీఎఫ్ఓ కృష్ణగౌడ్లతో కలసి ఏటూర్‌నాగారం, తాడ్వాయి, గోవిందరావుపేట, ములుగు, వెంకటాపూర్ మండల ప్రత్యేక అధికారులు,తహశీల్దార్లు,ఎంపీడీవోలు, ఎఫ్ ఆర్వోలు, పంచాయతీ సెక్రటరీలు,ఎఫ్ బివోల తో పోడుభూముల సర్వే ప్రక్రియ, అటవీ భూముల పరి రక్షణపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భం గా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో పోడు భూముల సర్వే ప్రక్రియ పూర్తిఅయిన హాబిటేషన్లలో ఈనెల 15వతేది ( రేపటి )నుండి గ్రామసభ నిర్వహించి దర ఖాస్తుదారుల సందేహాలు నివత్తి చేస్తూ పూర్తిచేయా లని అన్నారు. గ్రామ సభ నిర్వహించే ముందు గ్రా మంలో టాంటాం వేయిం చాలన్నారు. గ్రామ సభకు హాజరైన వారి హాజరు త ప్పక తీసుకోవాలన్నారు. గ్రామసభ నిర్వహించే ట ప్పుడు వీడియోగ్రఫీ చే యించాలన్నారు. చట్ట ప్ర కారం ఇదివరకే ఆక్రమణ లో ఉన్న వారికి మాత్రమే, ఆర్వోఎఫ్ఆర్ పట్టాలు జారిచేయుట జరుగుతుందని అన్నారు. కొన్నిగ్రామాల్లో కొత్తగా పోడు చేస్తే పట్టాలు ఇస్తారనే భావనఉందని, ఇది పూర్తిగా తప్పని ఆయన తెలిపారు. కొత్తగా పోడుచేస్తే, వారికి మంజూరయిన పట్టాలు రద్దు చేస్తామని, రైతుబంధు పథకాన్ని ఆపే స్తామని కలెక్టర్ అన్నారు. వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. జి ల్లాలో 80శాతం అడవిప్రాంతం ఉన్నందున అడవుల ను సంరక్షించే బాధ్యత ప్రతి ఒక్కరిదని, అడవుల సంరక్షణతోనే పర్యావరణ సమతుల్యత ఉంటుందని ఆయన తెలిపారు. కొత్తగా పోడు చేస్తే వెంటనే స మాచారం అందించే బాధ్యత క్రొత్త పంచాయితీరాజ్ చట్టం ప్రకారం ఆయా గ్రామాల సర్పంచ్ లపై ఉందని కలెక్టర్ అన్నారు.
జిల్లాలోని కొన్ని మండలాలలో ఇంకనూ మిగిలి ఉన్న పోడు భూముల సర్వే దరఖాస్తులకు సంబంధిం చి సర్వేను ఈనెల 15 వరకు పూర్తి చేయాలన్నారు. మండల స్థాయి ప్రత్యేక అధికారులు ఇట్టి పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఆన్ లైన్ లో నమోదు చే యించాలన్నారు.ఈ సందర్భంగా 25రోజుల్లో సర్వే పూర్తి చేసినందుకు అధికారులను కలెక్టర్ ప్రశం సిం చారు. అనంతరం రెవెన్యూ గెస్ట్‌హౌస్‌లో కలెక్టర్ ఐటీడీఏ పీవో అంకిత్, డీఎఫ్ఓ కష్ణ గౌడ్ లతో కలసి వాజేడు,మంగపేట, కన్నాయిగూడెం,వెంకటాపురం మండల ప్రత్యేక అధికారులు, తాహసిల్దార్లు, ఎంపీడీ వోలు, ఎఫ్ ఆర్ వో లు, పంచాయతీ సెక్రటరీలు, ఎ ఫ్బివోలకు చట్టప్రకారం గ్రామసభలు రెవిన్యూ అధికా రులు ఫారెస్ట్ అధికారులు సమన్వయంతో సమర్థవం తంగా నిర్వహించాలని దిశా నిర్దేశం చేశారు.ఈ సమావేశంలో ఎఫ్డిఓ జోగేందర్, డిఆర్ఓ రమాదేవి,
డిఆర్డి ఓ నాగ పద్మజ, సీఈఓ ప్రసన్న రాణి, షెడ్యూల్ కులాల అభివద్ధి అధికారి భాగ్యలక్ష్మి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ తులా రవి,డిపిఓ కే వెంకయ్య, డిఎస్ఓ అరవింద్ కుమార్, డిసిఓ సర్దార్ సింగ్ , మండల తాసిహాల్దారులు ఎం శ్రీనివాస్,రాజ్ కుమార్, ఏ నాగరాజు, సంజీవ, ఫారెస్ట్ అధికారులు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు ఆయా మండలాల ఎంపీడీవోలు ఇక్బాల్, ప్రవీణ్,ఈ డిస్ట్రిక్ట్ మేనేజర్ దేవేందర్ టెక్నికల్ సిబ్బంది,గ్రామ కార్యదర్శులు సంబంధిత శాఖ అధికారులు పాల్గొన్నారు.