Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విద్యార్థుల్లో నైపుణ్యాన్ని వెలిసి తీసేందుకే గ్రంథాలయ వారోత్సవాలు
- ఆధునాతన సౌకర్యాలతో జిల్లా కేంద్రంలో నూతన భవనం నిర్మిస్తాం
- భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి
నవతెలంగాణ-భూపాలపల్లి
గ్రంథాలయాలు విజ్ఞానాన్ని అందించే భాండా గా రాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమ ణారెడ్డి అన్నారు. సోమవారం జయశంకర్ భూపాల పల్లి జిల్లా కేంద్రంలోని మైనార్టీ గురుకుల కళాశాలలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మెన్ బుర్ర రమేష్ ఆధ్వ ర్యంలో 55వ అంతర్జాతీయ గ్రంథాలయ వారోత్సవా లను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎ మ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ముఖ్య అతిధిగా హా జరయ్యారు. గ్రంథాలయ వారోత్సవాలను ప్రారంభిం చారు. జాతీయ బాలల దినోత్సవంలో భాగంగా జవ హర్లాల్ నెహ్రూ చిత్ర పటానికి పూలమాల వేసి ని వాళులర్పించారు. అనంతరం మైనార్టీ కళాశాల వి ద్యార్థులు చేసిన చాచా నెహ్రూ చిత్ర పటాన్ని పరిశీ లించి, విద్యార్థులను ప్రశంసించారు. ఈ సందర్భం గా గండ్ర వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ సమాజా నికి గ్రంథాలయాల గొప్పతనాన్ని తెలపాలన్నారు. పుస్తకాలలో ఉన్న విజ్ఞానాన్ని బయటికి అందించాలనే లక్ష్యంతో మన పూర్వీకులు గ్రామ, మండల, జిల్లా కేంద్రాలలో గ్రంథాలయాలను ఏర్పాటు చేశారన్నారు. పూర్వపు రోజులలో ఇప్పుడున్నంత టెక్నాలజీ లేదని, తన చిన్నతనం నాటికి నేటికి చాలా టెక్నాలజీ పెరి గిందన్నారు. గతంలో చదువుకుందామంటే పుస్తకా లు సరిగా దొరికేవి కావని, ఒక్క విద్యార్ధి దగ్గర పుస్త కం ఉంటే ఆ విద్యార్థి చదువుకున్నాక అదే పుస్తకాన్ని మరోక విద్యార్ధి చదువుకునేటువంటి పరిస్థితి ఉండేద న్నారు. దీనిని గమనించిన రంగనాధం అనే విజ్ఞాని 19వ శతాబ్ధంలో ఫాదర్ ఆఫ్ ది లైబ్రరీ కార్యక్రమాన్ని ప్రారంభించారన్నారు.
నాటి నుండి నేటి వర కు గ్రంథాలయాలు ఉ న్న తమై జ్ఞానాన్ని అందించే పుస్తకాలు ఏర్పాటు చేయ డంతో విజ్ఞాన వంతమైన సమాజాన్ని తయారు చేయడం కోసం గ్రంథాలయా లు ఎంతగానో ఉపయో గపడుతున్నాయన్నారు. కొ న్ని వేలసంవత్సరాల క్రితం తక్షశిల అనే యూనివర్శి టిలో కొంతమంది గ్రంథాలయాన్ని తగులబెడితే అందులోని విద్యార్థులు కొన్ని నెలలపాటు ధర్నాలు చేసి కొన్నివేల పుస్తకాల సేకరణతో అంతకంటే పెద్ద నూతన గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసుకున్నారన్నా రు. భూపాలపల్లి ప్రాంతం రోజురోజుకు అభివృద్ధి చెందుతున్న ప్రాంతమని, భూపాలపల్లి జిల్లా కేం ద్రంలో జిల్లా కేంద్ర గ్రంథాలయానికి స్థల సేకరణ చేసి ఏడాదిలోపు ఆధునాతమైన వసతులతో కూడిన నూతన గ్రంథాయ భవనాన్ని నిర్మిస్తానన్నారు. అంతే కాకుండా గ్రంథాలయానికి సరిపడా నిధులు కేటా యించి కావాల్సినన్ని పుస్తకాలను అందిస్తానన్నారు.
సీఎం కేసీఆర్ సహకారంతో భూపాలపల్లిని ఎ డ్యుకేషన్ హబ్‌గా మార్చానని జిల్లా కేంద్రంలో నిర్మిం చిన ప్రభుత్వ డిగ్రీ కాలేజీ నేడు 2వేలమందితో మం దితో విజయవంతంగా నడుస్తున్నదన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల, గురుకుల పాఠశాలలు, కళాశాల లు తీసుకురావడం వల్ల జిల్లాలోని పేద పిల్లలకు ఉ న్నతమై విద్య అందుతుందన్నారు. వచ్చే సంవత్సరం నాటికి మెడికల్ కాలేజీని నిర్మించి, బోదనను కూడా ప్రారంభిస్తామన్నారు. భారత మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ పుట్టినరోజు గ్రంథాలయ వారో త్సవాల ను జరుపుకోవడం సంతోషకరమన్నారు. నెహ్రూ చూపిన బాటలో మనం నడవడం వలన దేశ జనాభా నేటికి 100 నుండి 140 కోట్ల జనాభా పెరి గినా ఎ వ్వరము కూడా ఆకలి లేకుండా జీవిస్తున్నా మన్నారు. విద్యార్థినీ, విద్యార్థుల్లో ఒక్కొక్కరు డ్రాయింగ్, పాట లు పాడటం, రంగోళీలో, ఉపన్యాసం వంటి అనేక అంశాలలో నైపుణ్యం కలిగి ఉంటారని, విద్యార్థుల్లోని నైపుణత్యను వెలికి తీయడం కోసమే గ్రంథాలయ వా రోత్సవాలను నిర్వహించడం జరుగుతుందన్నారు. గె లుపొందిన విద్యార్థులకు జీఎంఆర్ఎం ట్రస్ట్ ద్వారా ప్రశంస పత్రాలతో పాటు, బహుమతులు అందజేస్తా మన్నారు.
అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు
గ్రంథాలయ వారోత్సవాలను పురస్కరించుకోని జిల్లా కేంద్రంలోని ఆశ్రమ పాఠశాల విద్యార్ధినీలు, జం గేడు కస్తూర్భా పాఠశాల విద్యార్థినీలు చేసిన నృత్యా లు చూపరులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. విద్యా ర్థినీలు పల్లెప్రజల జీవన విధానాన్ని తెలియజేస్తూ నృ త్యాలు చేస్తుంటే సభప్రాంగణమంతా కేకలతో హోరె త్తి పోయింది. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి మున్సి పల్ చైర్పర్సన్ సెగ్గం వెంకటరాణి సిద్ధు, వైస్ చైర్మెన్ కొత్త హరిబాబు, టీఆర్ఎస్ భూపాలపల్లి అర్బన్ అధ్యక్షుడు కటకం జనార్ధన్, పీఏసీఎస్ చైర్మెన్ మేకల సంపత్ కుమార్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ గండ్ర హరీష్ రెడ్డి, మాజీ ఎంపీపీ కళేపు రఘుపతిరావు, కౌన్సిలర్లు మేకల రజీత మల్లేష్, నూనె రాజు పటేల్, శిరుప అనిల్, ముంజాల రవీందర్ గౌడ్, మంగళపెల్లి తిరుపతి, ముంజంపెల్లి మురళీధర్, హనుమాన్ టెంపుల్ చైర్మెన్ కుమార్ రెడ్డి, కో ఆప్షన్ మెంబర్లు ఇర్ఫాన్, కమల, గ్రంథాలయ డైరెక్టర్ ఐలయ్య, మైనార్టీ కళాశాల ప్రిన్సిపాల్ వెంకటేశ్వర్లు, గ్రంథా పాలకులు చంద్ర మోహన్, శారత, రామకృష్ణ, టీఆర్ఎస్ నాయకులు బీబీచారి, జాగరి అజరు యాదవ్, సింగనవేణి చిరంజీవి యాదవ్, కరీం, శ్రీకాంత పటేల్, రాజీరెడ్డి, మహిళా నాయకులు తిరుపతమ్మ, కళాశాల అధ్యాపక బృందం నూనె సుధాకర్, శేఖర్, కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.