Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భూపాలపల్లి
అసౌకర్యాలతో జిల్లా కేంద్రంలో కొనసాగుతున్న ఎస్టి కళాశాల హాస్టల్ ను అన్ని వసతులు ఉన్న భవనంలోకి మార్చే వరకు పోరాటాలు నిర్వహిస్తామని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సోతుకు ప్రవీణ్ హెచ్చరించారు. సోమవారం విద్యార్థుల సమస్య పరిష్కారం కొరకు భూపాలపల్లి పట్టణంలోని స్థానిక ఎస్టి బాయ్స్ కళాశాల హాస్టల్ మరొక భవనానికి మార్చాలని ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించడం జరిగింది. హనుమాన్ టెంపుల్ నుండి ప్రారంభమైనటువంటి పాదయాత్రను అంబేద్కర్ సెంటర్ వద్ద పోలీసులు అడ్డుకొని ఏఐఎస్ఎఫ్ నాయకులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సోతుకు.ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ స్థానిక ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం వల్ల హాస్టల్ విద్యార్థులకు శాపంగా మారింది అన్నారు. 40 మందికి సరిపడే భవనంలో 100 మంది విద్యార్థులు ఉండేసరికి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. సగం మంది విద్యార్థులు హాస్టల్ లోపట పడుకుంటే, మిగతా సగం మంది విద్యార్థులు హాస్టల్ బయటనే చలిలో పడుకుంటున్నారని తెలిపారు. ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి తో పాటు అధికారులు అన్ని హాస్టలను సందర్శించి విద్యార్థుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని చేశారు. ఎస్టి బార్సు కళాశాల హాస్టల్ ను మరొక భవనానికి తరలించేంతవరకు ఏఐఎస్ఎఫ్ నిరంతర పోరాటాలు నిర్వహిస్తుందని. పాదయాత్రను అడ్డుకోవడం సిగ్గుచేటని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు రేణిగుంట్ల ప్రవీణ్, నేరెళ్ల జోసెఫ్, పోతుల పవన్, చందు,పంగ మహేందర్, కట్ల సందీప్, శ్రీకాంత్, జంపాల పవన్ వందమంది హాస్టల్ విద్యార్థులు పాల్గొన్నారు.