Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు మంద శ్రీకాంత్
నవతెలంగాణ-పరకాల
విద్యారంగాన్ని కేంద్ర రాష్ట్ర, ప్రభుత్వాలు బ్రష్టు పట్టిస్తున్నాయని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు మంద శ్రీకాంత్ అన్నారు. మంగళవారం పట్టణంలోని గణపతి డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు పెండింగ్ స్కాలర్షిప్ పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిరుపేద విద్యార్థు లకు చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్ నేటి వరకు చెల్లించకపోవడంతో విద్యా ర్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఇప్పటివరకు మూడు వేల కోట్లు విద్యార్థులకు స్కాలర్షిప్స్, ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్లో ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిరుపేద విద్యార్థుల పట్ల చాలాక్రూరంగా వ్యవహరిస్తూ చదువుకోకుండా చూస్తుందన్నారు. ఇప్పటికైనా పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లను వెంటనే మంజూరు చేసేలా ప్రత్యేక చొరవ చూపాలన్నారు. లేనియెడల రాబోవు రోజుల్లో ఆందోళన కార్యక్రమా లు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ విద్యార్థి సం ఘం నాయకులు దిలీప్, అజయ్, మధు, అఖిల్, అజరు సాయి, భరత్ విద్యార్థు లు తదితరులు పాల్గొన్నారు.