Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్కైలాబ్ బాబు
నవతెలంగాణ-ఎన్జీవోస్ కాలనీ
రాజ్యాంగాన్ని మార్చాలని కేంద్రంలోని బీజేపీ కుట్రలు చేస్తోందని కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్కైలాబ్ బాబు తెలిపారు. మంగళ వారం కేవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు దూడపాక రాజేందర్ అధ్యక్షతన సుందరయ్య భవన్లో నిర్వహించిన సమావేశానికి జిల్లా ప్రధాన కార్యదర్శి మంద సంపత్తో కలిసి ఆ యన హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లా డుతూ దేశంలో కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి న నాటి నుండి పూర్తి స్థాయిలో రాజ్యాంగాన్ని మార్చా లనే కుట్రపూరితమైన ఆలోచనలు చేస్తుందన్నారు. పూర్తిస్థాయిలో ఎస్సీ, ఎస్టీ లా రిజర్వేషన్ని తగ్గించా లని యోగిఆదిత్యనాథ్ చేస్తున్న పనులను చూస్తుంటే స్పష్టంగా కనబడుతుందని తెలిపారు. అలాగే ప్రభు త్వ రంగ సంస్థలన్నింటినీ ప్రవేట్ సంస్థలకి కట్టబె ట్టడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ ఎనిమిది సంవత్సరాల కాలంలో రైల్వే ప్రైవేటీకరణలో అనేక రకాల ప్రభుత్వ ఆస్తుల్ని అ ప్పనంగా కట్టబెట్టడం జరు గు తోందన్నారు. అందు లో భాగంగానే ఎస్సీ, ఎస్టీ లకు పూర్తిస్థాయి లో రిజ ర్వేషన్స్ లేకుండా రాజ్యాం గాన్ని అమలు చేయకుం డా చేస్తున్నారన్నారు. మనుధర్మ శాస్త్రాన్ని, చాతవర్ణ వ్యవస్థ భారత దేశ అభివద్ధికి చాలా ముఖ్యమైనదని నరేంద్ర మోడీ అనుసరిస్తున్న విధానాల వల్ల స్పష్టం గా అర్థమయ్యే పరిస్థితులు ఉన్నాయన్నారు. అంతేకా కుండా ఎస్సీ, ఎస్టీలు, మైనార్టీలు, క్రిస్టియన్స్, ముస్లిం లపై మత కొట్లాటలు అనేకం జరుగుతూనే ఉన్నాయ న్నారు. భారతదేశంలో రాజ్యాంగాన్ని అమలు చేయ కుంటే పూర్తి స్థాయిలో నష్టపోయేది ఎస్సీ, ఎస్టీ లేనని వారు పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితులలో రాజ్యాం గాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఎంతైనా ఉందన్నారు. ఈ సమావేశంలో జిల్లా కమిటీ సభ్యులు కావ్య శ్రీ, హర్షం రామ్ కి, రేణిగుంట్ల చందర్, జడ రమేష్, కిషోర్, శ్వేత, స్రవంతి, యాకయ్య, మల్లేశం తదితరులు పాల్గొన్నారు.