Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు
నవతెలంగాణ-సుబేదారి
నేరాలకు పాల్పడిన వారు ఎట్టి పరిస్థితుల్లోనూ కేసుల నుంచి తప్పించు కోకుండా వారికి చట్టం పరిధిలో తగిన శిక్షపడేలా చూడాలని కలెక్టర్ రాజీవ్ గాం ధీ హనుమంతు అన్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో దర్యాప్తును వేగవంతం చ ేసి సాధ్యమైనంత త్వరగా చార్జ్‌షీట్ దాఖలు చేయాలని కలెక్టర్ సంబంధిత అధికా రులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్ లో నిర్వహిం చిన విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో జడ్పీ చైర్మన్ సుధీర్ కుమార్ తో కలసి కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ.. హనుమకొండ జిల్లాలో అండర్ ఇన్విస్టిగేషన్ కింద 11 కేసులు ఉన్నాయని, పెం డింగ్ ట్రయల్ కేసులు కింద 29 కేసులు ఉన్నాయని తెలిపారు. మళ్లీ నిర్వహించే విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశం నాటికి కేసుల దర్యాప్తులో పురోగతి ఉండాలన్నారు. అట్రాసిటీ కేసులకు సంబంధించిన ఘటనలు చోటుచేసుకున్న ప్పుడు బాధితులకు సరైన రీతిలో, సమగ్రంగా అన్ని అంశాలతో కమిటీ సభ్యులు సహకారం అందించాలని సూచించారు. బాధితులకు తప్పనిసరిగా పూర్తి న్యా యం జరిగేలా కృషి చేస్తామన్నారు. జడ్పీ చైర్మన్ సుధీర్ కుమార్ మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీల కేసులను త్వరితగతిన పరిష్కరించాల్సిన అవసరం ఉందన్నారు. న్యాయం చేసే విషయంలో ఎక్కడ ఆలస్యం జరగకూడదని ఆలస్యం అయినట్లైతే అక్కడ బాధితులకు నష్టం జరుగుతుందని పోలీసులు, అధికారులు తక్షణ మే స్పందించి బాధితులకు న్యాయం చేయాలన్నా రు. ఈ సమావేశంలో ఏసీపీ లు కిరణ్ కుమార్, శివ రామయ్య, జిల్లా అధికారులు నిర్మల, మాధవిలత, కమిటీ సభ్యులు ఈవీ శ్రీనివాస్, పుట్ట రవి, చుంచు రాజేందర్, రవి ప్రసాద్, జవహర్ లాల్ నాయక్,పరం జ్యోతి, దామోదర్ తదితరులు పాల్గొన్నారు.