Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైతాంగ ఉద్యమ స్పూర్తితో కార్మికులు పోరాడాలి
- సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి వంగూరు రాములు
నవతెలంగాణ-వెంకటాపురం
కార్మిక దోపిడీ విధానాలను తిప్పికొట్టాలని సీఐ టీయూ రాష్ట్ర కార్యదర్శి వంగూరి రాములు పిలుపుని చ్చారు. మంగళవారం స్థానిక మార్కెట్ యార్డులో దా వుద్, సరోజన, నీలదేవి అధ్యక్షత సీఐటీయూ ములు గు జిల్లా మహాసభలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ కేం ద్రంలో రెండవ సారి తిరిగి అధికారం లోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం కార్మిక, రైతాంగ, ప్రజా వ్యతిరేఖ వి ధానాలను అమలు చేయడంలో దుందుడుకుగా పో తుందన్నారు. గతంలో పరిపాలనచేసిన కాంగ్రెస్ కం టే ఎక్కువగా ప్రైవేటీకరణ విధానాలను అమలు చే స్తుందని విమర్శించారు. దీంతో కార్మికవర్గంపై భారా లు పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కార్పొరే ట్ శక్తులకు ఊడిగం చేయడంలో సూపర్‌ఫాస్ట్ ఎక్స్ ప్రెస్‌గా కేంద్ర బీజేపీ దూసుకుపోతున్నదని ఎద్దేవా చేశారు. జాతి సంపదను కొల్లగొట్టి వేల కోట్ల రూపా యల ఆస్తులను అంబానీ వంటి కార్పొరేట్ దిగ్గజాల కు కట్టబెడుతుందన్నారు. పోరాటాల ద్వారా సాధించుకున్న కార్మిక చ ట్టాలను రద్దు చేసి, నూత న 4లేబర్ కోడ్లను పట్టు కొచ్చారని వీటి అమలు ద్వారా కార్మిక సంఘాల ఉనికికే ప్రమాదం అన్నా రు. జాతి ఆస్తుల నగరీకరణ పేరుతో ప్రభుత్వ రంగ ఆస్తులన్నింటిని పెట్టుబడి దారులకు కట్టబెడుతున్నా రని అన్నారు. కరోనా వ్యాక్సిన్ కూడా అమ్మకానికి పె ట్టిన ఘనత మోడీకే దక్కుతుందన్నారు. పట్టణాలను ఆధునీకరించాలానే పేరుతో పట్టణాల్లో పేదలే లేకుం డా చేసే దానికి కుట్రలు పన్నుతున్నారన్నారు. విద్య, వైద్యం, పౌర సేవలన్నీ ప్రైవేట్ వ్యక్తులకు అప్పగిసు ్తన్నారన్నారు. స్కీమ్ వర్కర్స్ పని చేస్తున్న పథకాల నిర్వహణ బాధ్యత నుండి ప్రభుత్వం తప్పుకుని స్వచ్ఛంద సంస్థలకు అప్పగిస్తున్నారన్నారు.
కార్మిక చట్టాలను రద్దు చేసినందువల్ల కార్మికు లకు మాత్రమేకాకుండా ఉద్యోగులకు కూడా నష్టం జ రుగుతుందని అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థల అమ్మ కానికి నష్టాలు అనే కుంటిసాకుతో చూపించి తెగ న మ్ముతున్నారని విమర్శించారు. మోడీ అధికారంలోకి వచ్చేనాటికి ఉన్న నిత్యావసర వస్తువుల ధరలు ఈ 8 ఏళ్లలో 300 శాతం పెరిగాయన్నారు. కార్మికుల వేత నాలు మాత్రం పెరగకపోగా నెలకు రూ.4650లు క నీస వేతనం ఉంటే చాలని ప్రధానమంత్రి కొత్త భాష్యం చెబుతున్నారని దుయ్యబట్టారు. పెరుగుతు న్న ధరలకు అనుగుణంగా కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మోడీ అధికారం లోకి వచ్చే నాటికి అధాని ఆస్తులు రూ.1లక్ష కోట్లు ఉంటే నేడు రూ.10 లక్షల కోట్లకి చేరుకున్నాయన్నా రు. ఈ విధానాలను తిప్పి కొట్టకపోటే కార్మికులకు భవిష్యత్ లేకుండా పోతుందని రైతాంగ పోరాటస్పూర్తితో బహుళ రోజుల సమ్మెలకు కార్మిక వర్గం సిద్దం కావాలని పిలుపునిచ్చారు. దేశ మాజీ ప్రధాని ఇంది రాగాంధీ ఎమర్జెన్సీని తిప్పికొట్టిన చరిత్ర కార్మిక వర్గానికి ఉందని స్పష్టం చేశారు. కార్మిక సమస్యలపై పోరాటాల రూపకల్పనకు మహాసభ వేదిక కానున్నద న్నారు. తొలుత సీఐటీయూ జెండాను దావూద్ ఆవి ష్కరించిన అనంతరం కార్మిక సంఘాల ఆధ్వర్యం లో భారీ ర్యాలీ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి బి మధు, సీఐటీయూ జిల్లా కార్యదర్శి రత్నం రాజేందర్, కట్ల నర్సింహచారి, బొడ రమేష్, గ్యానం వాసు, కుమ్మరి శ్రీను, ఆదినారాయణ, వంక రాము లు, డీవైఎఫ్ఐ రత్నం ప్రవీణ్, ఎస్ఎఫ్ఐ తోకల రవి, సుధాకర్, సమ్మక్క, బుడిమే సదయ్య, పోశాలు, రంజి త్, నాగమణి అంగన్వాడీ, ఆశా, హమాలీ, గ్రామ పంచాయతీ, హాస్టల్ డైలీ వేజ్, భవన నిర్మాణం, హమాలీ తదితర రంగాలకు చెందిన 500 మంది కార్మికులు పాల్గొన్నారు.