Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎం కేసీఆర్, మంత్రి సత్యవతిరాథోడ్లకు కృతజ్ఞతలు
- పనులు ప్రారంభించేలా అధికారులు చొరవ చూపాలి
- ములుగు ఎమ్మెల్యే డాక్టర్ సీతక్క
నవతెలంగాణ-ములుగు
ములుగు నియోజకవర్గానికి లింకురోడ్ల అభివృ ద్ధికి రూ.23 కోట్ల నిధులు మంజూరయ్యాయని, అధి కారులు టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి వెంటనే పనులు ప్రారంభించాలని కాంగ్రెస్ జాతీయనేత,ఎమ్మెల్యే డా క్టర్ సీతక్క తెలిపారు. మంగళవారం ములుగు ఎ మ్మెల్యే క్యాంప్కార్యాలయంలో సీతక్క మాట్లాడుతూ నియోజకవర్గం వెనుకబడిన ప్రాంతమని ఈ ప్రాంత అభివృద్ధికి రాష్ట్రప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపాల న్నారు. గిరిజన శాఖ ద్వారా ములుగు నియోజక వర్గ అభివృద్ధికి రూ.23కోట్లు కేటాయించినందుకు ముఖ్య మంత్రికి, సంబంధిత మంత్రికి, జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్యకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఇంకా అనే క గ్రామాలకు రోడ్లు లేక కనీస సౌకర్యాలు లేక ప్రజ లు ఇబ్బందులు పడుతున్నారని రాష్ట్ర ప్రభుత్వం వెను కబడిన ప్రాంతాల అభివృద్ధిపై ప్రత్యేక చొరవ తీసుకో వాలన్నారు. మంజూరైన రోడ్ల వివరాలు ఈ సంద ర్భంగా సీతక్క వివరించారు.
ములుగు మండలం పులిగుండం నుండి చింత కుంట బిటి రోడ్డు, జిల్లా పరిషత్ రోడ్డు నుండి రాం సింగ్తండా బిటిరోడ్డు, వెంకటాపూర్ మండలం అడ విరంగాపూర్ నుండిరామారావుపల్లి బిటిరోడ్డు, గో విందారావుపేట మండలం జాతీయ రహదారి నుం డి గోవిందారావు పేట ఫుట్ ఫారంబిటి రోడ్డు,రాం నగర్ టూ ఎల్బి నగర్ వరకు బిటి రోడ్డు,పాపయ్య పల్లి నుండి దుంపిల్లగూడెం బిటి రోడ్డు, మాన్య తండా నుండి దుంపిల్లగూడెం బిటి రోడ్డు,టప్పమంచ నుండి ముత్త పురం బిటి రోడ్డు,పాత నాగారం (నేతాజీ నగర్) నుండి పసర నాగారం వరకు బిటి రోడ్డు, తాడ్వాయి మండలం ఆశన్నగండ ఏళ్ళపూర్ నుండి బెరెల్లి బిటి రోడ్డు, ఏటూరు నాగారం మండలం అల్లం వారి ఘ నపురం నుండి ఎలిషెట్టి పల్లి వరకు, చిన్న బోయిన పల్లి నుండి పెద్దవేంకటాపురం వరకు, చింతలపహాడ్ నుండి ఏటూరునాగారం వరకు, కొండాయి నుండి ఏ టూరునాగారం వరకు, శివపూర్ నుండి ఏటూరు నా గారం వరకు, మంగపేటమండలం వాడగూడెం బిటి రోడ్డు నుండి వీరారాజు హౌస్ రామాలయం వరకు, ఆర్అండ్బి రోడ్డు నుండి కత్తిగూడెం వరకు, కొత్తచీపు రు దుబ్బరామచెంద్రునిపేట వరకు, కన్నాయిగూడెం మండలం ఐలాపురం నుండి సమ్మక్క గుడివరకు బి టిరోడ్డు కొత్తగూడ మండలం పోగుల్లపల్లి నుండి మొండ్రాయిగూడెం వయ మోకాళ్ళ పల్లి వరకు బిటి రోడ్డు, ఓటాయి నుండి అంకన్న గూడెం వరకు బిటి రోడ్డు, ఆర్అండ్బిరోడ్డు నుండి ఈశ్వరి గూడెం వరకు , కర్లాయి నుండి దొరవారి తిమ్మాపూర్ వరకు, మోం డ్రాయిగూడెం నుండి ఎంచగూడెం వరకు, గోపాల పురం నుండి నక్కలగుంపు వరకు, ముషిమి తండా నుండి దుర్గంవరకు బిటి రోడ్డు, గంగారాం మండలం ఆర్ అండ్ బి రోడ్డు టూ బావురుగూడ వరకు బిటి రోడ్డు, గంగారాం క్రాస్ రోడ్డు నుండి గుడిపాడు వర కు, గంగారాం క్రాస్ రోడ్డు టూ బురక వారి గుంపు వరకు బిటిరోడ్డు వరకు రోడ్లు మంజూరు కావడం జరిగిందని రోడ్ల నిర్మాణం కోసం సహకరించిన ములుగు జిల్లా కలెక్టర్, మహబూబాబాద్ జిల్లా కలెక్టర్, ఏటూరు నాగారం ఐటిడిఏ పీఓ కు ధన్యవాదాలు తెలుపుతూ యుద్ద ప్రాతిపదికన టెండర్ ప్రక్రియను పూర్తి చేసి పనులు ప్రారంభించే విధంగా అధికారులు అన్ని రకాల చర్యలు వేగంగా తీసుకోవాలని సీతక్క అన్నారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నల్లెల కుమారస్వామి,కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు గొల్ల పెల్లి రాజేందర్ గౌడ్,యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బానోత్ రవి చందర్,ఫిషర్ మెన్ జిల్లా అధ్యక్షులు కంబాల రవి,కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఎండీ చాంద్ పాషా, వర్కింగ్ కమిటీ అధ్యక్షులు ఆకు తోట చంద్ర మౌళి,ములుగు పట్టణ అధ్యక్షులు వంగ రవి యాదవ్, కిసాన్ సెల్ జిల్లా కార్యదర్శి శంకరయ్య,సర్పంచ్ గండి కల్పన కుమార్,కిసాన్ సెల్ జిల్లా ప్రచార కార్యదర్శి నునేటి శ్యామ్,ఎంపీటీసీ మవురాపు తిరుపతి రెడ్డి,ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు మట్టే వాడ తిరుపతి,యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు చింత క్రాంతి కుమార్,గ్రామ కమిటీ అధ్యక్షులు గుండ భిక్షపతి, ముదర కోళ్ల తిరుపతి, మేడం రమణ కర్ తదితరులు పాల్గొన్నారు.