Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రతి విద్యార్థి పై ప్రత్యేక శ్రద్ధ వహించాలి
- పిల్లలను భాగస్వామ్యం చేస్తూ విద్యాబోధన జరగాలి
- విద్యార్థుల పురోగతి పరిశీలించాలి : కలెక్టర్ భవేష్ మిశ్రా
నవతెలంగాణ-భూపాలపల్లి
జిల్లాలో ఉన్న 363 ప్రభుత్వ ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ పాఠశాలల్లో తొలిమెట్టు కార్యక్రమాన్ని సమర్థ వంతంగా అమలు చేయాలని జిల్లాకలెక్టర్ భవేష్ మి శ్రా అధికారులను ఆదేశించారు. తొలిమెట్టు కార్యక్ర మం అమలుపై ప్రగతి భవన్ సమావేశ మందిరం లో విద్యాశాఖ అధికారులతో కలెక్టర్ రివ్యూ సమావే శం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ప్రాథమిక దశలో విద్యార్థుల విద్యా ప్రమాణాలు చాలాతక్కువగా ఉన్నాయని, 75 శాతం విద్యార్థులకు పూర్తిస్థాయి ప్రమాణాలు ఉండ టం లేదని, జాతీయ సర్వేప్రకారం దేశంలో చివరి నుండి 3వ స్థానంలో మనరాష్ట్రం ఉందన్నారు. ప్రాథ మిక విద్యార్థులలో విద్యా ప్రమాణాలు పెంచి మం చి ఫలితాలు సాధించాలనే లక్ష్యంతో పిల్లల కనీస ప్ర మాణాలపై శ్రద్ధతో తొలిమెట్టు కార్యక్రమం అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. జిల్లాలో ఉన్న 319 ప్రై మరీ పాఠశాలలు, 44 అప్పర్ ప్రైమరీ పాఠశాలలు మొత్తం 363 పాఠశాలలలో 1 నుంచి 5వ తరగతు ల్లోని ప్రతీవిద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ వహించి ప్రమాణా లు మెరుగుపరచాలన్నారు. జాతీయస్థాయిలో విద్యా ర్థుల్లో నాణ్యత ప్రమాణాలు 59శాతం ఉంటే మన తెలంగాణలో 28శాతం ఉండటం విచారకరమని, దీనిని సమూలంగామార్చే విధంగా ఉపాధ్యాయు లు ప్రత్యేక శ్రద్ధతో పని చేయా లని పిలుపునిచ్చారు. బీ హార్, ఉత్తర్ ప్రదేశ్ వంటి రాష్ట్రాలతో పోలిస్తే అత్యధిక సదుపాయాలు, వసతు లు అందుబాటులో ఉన్నాయని, వాటిని వినియోగిం చుకుంటూ ముందుకు సాగాలని కలెక్టర్ తెలిపారు. ఇటీవల జరిగిన టి-20 ప్రపంచకప్లో సైతం మొద ట చిన్నదేశాలతో ఓడిపోయి వెనుకంజలో ఉన్న ఇం గ్లాండ్,పాకిస్థాన్లు ఫైనల్ తలపడ్డాయని ఆస్ఫూర్తితో మనమంతా సమిష్టిగా విద్యార్థుల ప్రమాణాలు పెం చే దిశగా కృషి చేయాలని సూచించారు.
జిల్లాలో అమలవుతున్న తొలిమట్టు కార్యక్రమం పర్యవేక్షిస్తున్న 35 నోడల్ అధికారులను కలెక్టర్ పురో గతి అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో అనుసరిస్తు న్న విద్యాబోధన, టీచర్ల పనితీరు తదితర అంశాల ను కలెక్టర్ ఆరా తీశారు. నవంబర్ 30 నాటికి ప్రాథ మిక విద్యార్థులను పరిరక్షించి వారి ప్రమాణాలు మె రుగు పరచడానికి ప్రణాళిక సిద్ధం చేయాలని, వచ్చే 4 మాసాలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.ప్రాథమిక స్థాయి పిల్లలకు అక్షరాలను గుర్తించడం, చిన్న చిన్న వ్యాసాలు చదవడం, బేసిక్ మాథ్స్ తదితర అంశాల పై పిల్లలను భాగస్వామ్యం చేస్తూ ఆహ్లాదకరమైన వాతావరణంలో బోధన జరిగే విధంగా కార్యాచరణ సిద్ధం చేయాలన్నారు. జిల్లాలో విద్యాశాఖ అధికారులు లు ఆకస్మిక తనిఖీ నిర్వహిస్తూ క్షేత్రస్థాయిలో తొలిమెట్టు పకడ్బందీగా అమలు చేయాలని, విద్యార్థుల ప్రమాణాలను, పురోగతిని పర్యవేక్షించాలనిసూచించారు.
ప్రతిరోజు పాఠశాలలో తొలి మెట్టుకు సంబం ధించి తరగతులను తీసుకునే విధానంలో మార్పులు రావాలని, పిల్లలను ఆకట్టుకునే విధంగా తరగతులు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ప్రతిరో జు పిల్లలు చదివే విధంగా చర్యలు తీసుకోవాలని, పాఠశాలలో ప్రత్యేకంగా రీడింగ్ పిరియడ్ ఉండాలని సూచించారు.ప్రైవేటు పాఠశాలల కంటే మన ప్రభు త్వ పాఠశాలల్లో మంచి విద్యాప్రమాణాలు, అనుభ వం కలిగిన ఉపాధ్యాయులు అందుబాటులో ఉన్నా రని వారి సేవలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, అధికా రులు సమన్వయంతో పనిచేసి మార్చి 2023 నాటికి ప్రాథమిక విద్యా ప్రమాణాలో విప్లవాత్మక మార్పులు సాధించాలని ఆకాంక్షించారు.
జిల్లాలో ప్రతి విద్యార్థి పై ప్రత్యేక శ్రద్ద వహిస్తూ విద్యా ప్రామాణాలు పెంపొందించుటకు కషి చేయా లని ఆదేశించారు. పాఠశాలల్లో మండల విద్యాధికా రులు, మండల నోడల్ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తూపురోగతిని పర్యవేక్షించాలని సూచించా రు. విద్యా ప్రమాణాలు మెరుగుపరచడమే లక్ష్యంగా ఉపాధ్యాయులు అంకితభావంతో, ఓపికతో సేవలు అందించి నవ సమాజ నిర్మాతలను రూపొందించేం దుకు కృషి చేయాలని కోరారు. ఈ సమావేశంలో లో జిల్లా విద్యాశాఖ అధికారి రాజేందర్, మండల విద్యా శాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయులు, రిసోర్స్ పర్సన్స్, అధికారులు తదితరులు పాల్గొన్నారు.