Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఏటూరునాగారం ఐటిడిఏ
గిరిజన పల్లెల్లోని ప్రజలకు పోలీసుశాఖ అండగా ఉంటుందని, వారికి ఎదుర య్యే సమస్యలను పోలీసుశాఖకు తెలిపితే పరిష్కారాన్ని చూపుతామని జిల్లా ఎస్పీ సంగ్రామ్‌సింగ్ పాటిల్ అన్నారు. ఏటూరునాగారం మండల కేంద్రంలోని పీఎం ఆర్సీ కార్యాలయం ఆవరణలో మంగళవారం పోలీసుల ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరాన్ని జిల్లా ఎస్పీ ప్రారంభించి మాట్లాడారు. గిరిజన గ్రామాల్లో రక్తహీనత, ఇతర వ్యాధులతో అనేకమంది ఇబ్బందులు పడుతుంటారని, అలాంటి వారికి సరై న చికిత్సలు అందించడానికి మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించామన్నారు. అలాగే గి రిజనులు, గొత్తికోయలు ఆరోగ్య రుగ్మతులు ఎదుర్కొంటున్న సమయంలో ఐసీడీ ఎస్, వైద్యశాఖతో పోలీసు శాఖ పనిచేసి సంపూర్ణమైన ఆరోగ్యం ఇచ్చేందుకు దోహ ద పడుతుందన్నారు. గొత్తికోయగూడేల్లో రక్తహీనత కేసులు ఎక్కువగా ఉన్నాయని డీడబ్ల్యూఓ ప్రేమలత చెప్పారని, దానిని నిర్మూలించేందుకు తాము సహకరిస్తామ న్నారు. ఆరోగ్యమే మహాభాగ్యంగా పరిగణించాలన్నారు. అసాంఘిక శక్తులకు ఎవ రు కూడా సహకరించరాదన్నారు. ఏ సమస్య ఉన్నా నేరుగా పోలీస్‌స్టేషన్‌కు వచ్చి సమస్యను వివరించాలని కోరారు. ప్రజారక్షణ కోసమే పోలీసు పనిచేస్తుందనే వి షయాన్ని ప్రజలు గమనించాలన్నారు. ప్రభుత్వం అందిస్తున్న పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకొని ఎదగాలని ఆమన కోరారు. నిరుద్యోగులకు గతంలో ఉచి త శిక్షణలు ఇచ్చామని, అనేక ఉపాధి అవకాశాలున్నాయని వాటిని అందిపుచ్చు కుని పోలీసుశాఖలో యువత పెద్ద ఎత్తున చేరాలన్నారు.గొత్తికోయలకు మఫలర్స్, న్యాప్కిన్ కిట్లను, పిల్లలకు మంకీక్యాప్స్ను, కంటి అద్దాలు, మందులను ఎస్పీ వారి కి అందజేశారు. అనంతరం డీడబ్ల్యూఓ ప్రేమలత మాట్లాడుతూ గిరిజన మహి ళలు గర్భం దాల్చిన వెంటనే అంగన్వాడీ టీచర్లకు, హెల్త్ సిబ్బందికి చెప్పాల న్నారు. వ్యక్తిగత శుభ్రత పాటించి ఆరోగ్యంగా ఉండాలన్నారు. సరైన పోషకా హారం తీసుకొని పుట్టబోయే బిడ్డకు రక్షణ కల్పించాలన్నారు. అనంతరం ఈ మెగా హెల్త్ క్యాంప్‌కు సహకరించిన వైద్యులు, సిబ్బంది, మెడికల్‌షాపుల యజమాన్యా లకు ఎస్పీ కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం వైద్యాధికారులను పోలీసులు సన్మా నించారు. అదేవిధంగా ఎస్పీ సంగ్రామ్‌సింగ్, ఓఎస్డీ గౌస్ఆలం, ఏఎస్పీ అశోక్‌కు మార్లను పోలీసులు సన్మానించారు. కార్యక్రమంలో సీఐ మండల రాజు, ఏటూ రునాగారం ఎస్సె రమేష్, మంగపేట ఎస్సెలు తాహేర్‌బాబా, రవికుమార్, కన్నా యిగూడెం ఎస్సె సురేష్, సిబ్బంది పాల్గొన్నారు.