Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లాలో 155 కేంద్రాలు ఏర్పాటు కలెక్టర్ కృష్ణఆదిత్య
నవతెలంగాణ-ములుగు
వరిధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఎలాంటి ఇ బ్బందులు తలెత్తకుండా ధాన్యం సేకరణ చేయాల ని జిల్లా కలెక్టర్ యస్.కృష్ణఅదిత్య అన్నారు. మంగళవా రం కలెక్టరేట్లో ఖరీఫ్‌లో 2022-23 ధాన్యం కొ నుగోలు నిర్వహణపై కలెక్టర్ పౌరసరఫరాల శాఖ గ్రామీణాభివృద్ధి,జిల్లా వ్యవసాయ, జిల్లా సహకార, గి రిజన సహకార శాఖల అధికారులతో అవగాహన స దస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మా ట్లాడుతూ ఈ సంవత్సరం వర్షాకాలం సీజన్లో జిల్లా వ్యాప్తంగా 155 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని అలాగే జిల్లా వ్యాప్తంగా 1 ల క్ష 95వేల టన్నులు వరి ధాన్యం కొనుగోలు చేయడా నికి లక్ష్యం నిర్ధేశించుకోగా అందుకు అవసరమైన అ న్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్న ట్లు తెలిపారు. జిల్లాలోని అన్ని వరిధాన్యం కొనుగో లు కేంద్రాల వద్ద మాయి శ్చ రైజ్ మిషన్లు, ఎలక్ట్రానిక్ తూకం మిషన్లు, నీటి సదు పాయంతోపాటు రైతుల కు అన్నిరకాల సౌకర్యాలు కల్పించాలని సంబంధిత శాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
రైతులు పండించిన ధాన్యాన్ని వ్యవసాయ క్షేత్రా ల నుంచి తీసుకువచ్చేందుకు గోనె సంచులకు ఎలాం టి ఇబ్బందిలేదని సరిపడా సంచులు ఉన్నాయని కలె క్టర్ పేర్కొన్నారు. రైతులు తీసుకువచ్చి తూకం వేసిన ధాన్యాన్ని వెంట వెంటనే లారీల ద్వారా ట్రాన్స్‌పోర్టు చేసి తరలించేలా చూడాలని అందుకు సంబంధించి అవసరమైన హమాలీలను ఎక్కువ సంఖ్యలో ఏర్పా టు చేసుకొనిఎలాంటిఇబ్బందులు తలెత్తకుండా ముం దస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా ఈ విషయంలో ఏమాత్రం బాధ్యతారాహిత్యంగా వ్యవహరిం చరాదని దీనిని దష్టిలో పెట్టుకొని మార్కెటింగ్‌శాఖ అధికారు లు, ట్రాన్స్ పోర్టు కాంట్రాక్టర్లు, రైస్ మిల్లుల యాజ మానులు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని కలె క్టర్ ఆదేశించారు. అలాగే రైతులకు సంబంధించిన ధాన్యాన్ని వరుస క్రమంలో కొనుగోలు చేయాలని ఈ విషయంలో వారికి ఎలాంటి ఇబ్బందులు ఏర్పడినా సంబంధిత శాఖ అధికారులపై చర్యలు తప్పవని కేం ద్రానికి ఒక అధికారిని నియమించాలని అధికారుల ను కలెక్టర్ సూచించారు.రైతులకు ధాన్యం కొనుగోలు సమయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇ ప్పటి నుంచే అవసరమైన అన్ని రకాల సదుపాయా లు కల్పించామని మరికొన్నిచోట్ల కూడా మిగిలిన ఏ ర్పాట్లు చేస్తామని వివరించారు. దీంతో పాటు రైతు లు సైతం ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొను గోలు కేంద్రాల్లోనే తమ ధ్యానం విక్రయించాలని మధ్య దళారులకు అమ్మి మోసపోవద్దని కలెక్టర్ కోరారు.
ఈ అవగాహన సదస్సు లో జిల్లా అదనపు కలెక్ట ర్ రెవెన్యూ వైవి గణేష్ డిఎస్ఓ అరవింద్ కుమార్ రెడ్డి, డిఏఓ గౌస్‌హైదర్, డిఆర్డిఓ నాగ పద్మజ, జిస ిసి మేనేజర్ ప్రతాప్ రెడ్డి, డిఎం శ్రీరాములు, రైతు స మన్వయ సమితి జిల్లా అధ్యక్షులు పళ్ళ బుచ్చయ్య, డిసిఓ సర్దార్ సింగ్, జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేష న్ అధ్యక్షులు కాట్రగడ్డ సతీష్ కుమార్, సంబంధిత శాఖ అధికారులు ఏవోలు ఏఈవోలు కొనుగోలు కేంద్రాల ఇన్చార్జీలు తదితరులు పాల్గొన్నారు.