Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా సాధారణ సర్వసభ్య సమావేశం తీరు
- ఏకపక్షంగా వ్యవహరించిన జెడ్పీ చైర్మన్
- అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు గైర్హాజరు
- ప్రజా సమస్యలపై పట్టింపేది ?
- పోడియం ముందు కాంగ్రెస్ ప్రజా ప్రతినిధుల నిరసన
నవతెలంగాణ-భూపాలపల్లి
జిల్లాలో జిల్లా ప్రజా పరిషత్ పాలన అసలే అస్తవ్యస్తంగా కొనసాగుతోంది. ఈ క్రమంలో ఆయా మండలాల్లో నెలకొన్న సమస్యలను అధికారుల దష్టికి తీసు కెళ్లి సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరాలనే సందర్భం లో ప్రతిపక్ష ప్రజా ప్రతినిధులు అగ్రహానికి గురికావాల్సి వచ్చింది. మంగళవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఇల్లంద క్లబ్ హౌస్ లో జిల్లా సాధార ణ సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి టిఆర్ఎస్ జెడ్పిటిసి లు, ఎంపీటీసీలు గైరాజర్ కాగా, కాంగ్రెస్ పార్టీకి చెందిన జడ్పిటిసిలు ఎంపీపీలు మాత్రమే హాజరయ్యారు. ఈ క్రమంలో జడ్పీ చైర్మన్ జక్కు శ్రీహర్షినితోపాటు జెడ్పి సీఈవో రఘువరన్ మాత్రమే సభా వేదికపై హాజరయ్యారు. సభ మొదలెట్టిన 40 నిమిషాల అనంతరం సమావేశాన్ని అర్ధాంతరంగా రద్దు చేశారు.
మొదటగా డిఆర్డిఓ జిల్లా అధికారి పురుషోత్తం గత మూడు నెలలుగా జరిగిన పనుల పురోగతిపై వివరిస్తుండగా ప్రతిపక్ష సభ్యులు ఎక్కడి సమస్యలు అక్కడే ఉ న్నాయని పూర్తిగా పనులు జరగలేదని ఆరోపించారు. అధికార పార్టీ సభ్యులు స మావేశానికి రాకపోవడానికి కారణాలు ఏంటి అని ప్రశ్నించారు.. ఇదిలా కొనసాగు తుండగానే హైదరాబాద్లో ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశంలో పాల్గొనాలని ప్ర జా ప్రతినిధులువెళ్లారని తను కూడా వెళ్లాల్సిఉందని కాబట్టి సమావేశాన్ని వాయి దా వేస్తున్నట్లు జెడ్పీ చైర్పర్సన్ జక్కు శ్రీహర్షిణి ఏకపక్షంగా నిర్ణయం తీసుకొని అ ర్ధాంతరంగా సమావేశాన్ని రద్దు చేస్తూ ప్రకటించారు.
దీంతో కాంగ్రెస్ పార్టీ ఎంపీపీలు, జెడ్పీటీసీలు అగ్రహం వ్యక్తం చేస్తూ మాట్లా డారు. ఈసందర్భంగా కాటారం ఎంపీపీ పంత కానీ సమ్మయ్య, మహాముత్తారం జెడ్పీటీసీ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ లింగమల శారద, మహాదేవపూర్ జెడ్పిటిసి గుడాలఅరుణ మాట్లాడుతూ సమావేశానికి కావాల్సిన ఫోరం ఉందని, సమావేశా న్ని కోనసాగించాలని పట్టుబట్టారు. ఎమ్మెల్యే హజరు కాకపోతే సమావేశం నిర్వ హించరా అని ప్రశ్నించారు. ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి హైద్రాబాద్ వెళ్లితే అధికార పక్షం జెడ్పీటీసీలు, ఎంపీపీలు ఎక్కడివెళ్లారని, కొంతమంది ఇక్కడే భూపా లపల్లిలో ఉండి సమావేశానికి ఉద్దేశపూర్వకంగా హజరు కాలేదని కాటారం ఎంపీ పీ పంతకాని సమ్మయ్య ఆరోపించారు.
సమస్యలపై ప్రతిపక్షాలు నిలదీస్తాయని సమాధానాలు చెప్పలేకనే సమావేశా న్ని రద్దు చేస్తున్నారని విమర్శించారు. దీంతో జెడ్పీ చైర్పర్సన్ సమస్యలపై చర్చించా ల్సిన బాధ్యత అందరికి ఉందని,హెద్రాబాద్ వెళ్లాల్సి ఉన్నందున, సమావేశాన్ని ర ద్దు చేస్తున్నామని, ప్రతిపక్షాల నాయకులు అన్యద ఆభవించవద్దని, త్వరలోనే సమావేశాన్ని ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తానని తెలిపివెళ్లిపోయారు. ఈ కార్యక్ర మంలో కాంగ్రెస్ పార్టీ జెడ్పీటీసీలు ఎంపీపీలు ఆయాశాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
పజా సమస్యలపై పట్టింపు ఏది ?...
పోడియం ముందు కాంగ్రెస్ ప్రజా ప్రతినిధుల నిరసన
జిల్లా కేంద్రంలోని ఇల్లందు క్లబ్ లో జరిగిన జడ్పీ సాధారణ సమావేశాన్ని జడ్పీ చైర్మన్ శ్రీహర్షిని ఏకపక్ష నిర్ణయంతో అర్ధాంతరంగా రద్దు చేయడంతో అధి కార పార్టీ ప్రజా ప్రతినిధులకు ప్రజా సమస్యలపై పట్టింపు లేదని కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు పోడియం మందు నినాదాలుచేస్తూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు జిల్లాలో అనేక సమస్యలు ఉన్నాయని కలెక్టర్ కా ర్యాలయ భవన సముదాయం ఇప్పటివరకు పూర్తి కావడం లేదని, 100 పడకల ఆసుపత్రికి సరైన రహదారి లేక రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా రన్నారు. జిల్లాలో మరుగుదొడ్లు 100 శాతం పూర్తయ్యాయని అధికారులు లెక్కలు చెబుతున్నారు తప్ప 50శాతం కూడా పూర్తి కాలేదని ఆరోపించారు. అకాల వర్షం తో వరదల వల్ల నష్టపోయిన రైతులకు ఇప్పటివరకు పరిహారం అందలేదని అదేవి ధంగా పలు మండలాలలో విద్యా వ్యవస్థ సరిగా లేదని ప్రభుత్వం అందిస్తున్న పె న్షన్లు రాక ప్రజలు ఇబ్బంది పడుతున్నారని వారు వివరించారు. కలెక్టర్, రావాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా జెడ్పీ సీఈఓ రఘువరన్ వచ్చి ఈనెలకారుకల్ల సమావేశాన్ని ఏర్పాటు చేసే విధంగా చూస్తానని హమీ ఇవ్వడంతో నిరసనను విరమించారు. నెలాఖరు వరకు సమావేశం ఏర్పాటు చేయక పోతే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ కార్యాలయం ముందు ఆందోళనలు చేస్తామని హె చ్చరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జడ్పిటిసిలు లింగమల శారద, గు డాల అరుణ, అయితే కోమల, గండ్ర పద్మ ఎంపీపీలు పంతకాని సమ్మయ్య, మల హలరావు తదితరులున్నారు.