Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - స్టేషన్‌ఘన్‌పూర్
హెయిర్ కటింగ్ రంగంలోకి రిలయన్స్ రావ డాన్ని వ్యతిరేకిస్తూ నాయి బ్రాహ్మణ సేవా సంఘ కమిటీ ఆధ్వర్యంలో డివిజన్ కేంద్రంలో మంగళవారం రిలయన్స్ సంస్థలు, అధినేత ముకేశ్ అంబానీ దిష్టిబొమ్మ దగ్ధం చేసి, నిరసన ప్రదర్శన నిర్వహిం చారు. ఈ సందర్భంగా నాయి బ్రాహ్మణుల జిల్లా గౌరవ అధ్యక్షుడు కొలిపాక సతీష్ మాట్లాడుతూ దేశంలో తెలంగాణ రాష్ట్రంలో (సెలూన్) క్షవర వత్తిలోకి ఇతర సామాజిక వర్గాలను, రిలయన్స్ అంబానీ లాంటి బడ పెట్టుబడిదారీ కార్పొరేట్ కంపె నీలు, కార్పొరేట్ సెలూన్లను ఏర్పాటు చేయకుండా అరికట్టే విధంగా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుని, నాయి బ్రాహ్మణుల (సెలూన్ల) క్షవర వత్తి భద్రత కోసం ప్రభుత్వం జీవో జారీ చేయాలని, సెలూన్లను నడు పుతూ జీవనాధారం పొందుతున్న నాయి బ్రాహ్మణులకు అండగా నిలవాలని, నాయి బ్రాహ్మణుల కులవత్తి హక్కును ఇతర సామాజిక వర్గ, కులస్తులకు, బడా పెట్టుబడిదారీ కంపెనీలకు, అవకాశం ఇవ్వకుండా, క్షవర వృత్తి పై, నాయి బ్రాహ్మణ సామాజిక వర్గానికి పేటెంట్ హక్కు కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు సతీష్ జంపాల శ్రీనివాస్, కొలిపాక వేణు, ఐలయ్య, రాగయ్య, శంకర్, రాము, గౌరీ, ప్రశాంత్, రవి, బాలరాజు, రాజు, నవీన్, శివ, వీరేష్, సురేష్, వెంకటేష్, పాల్గొన్నారు.