Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మత్స్యకారులు, మత్స్య కార్మిక సంఘం
- జిల్లా కార్యదర్శి రమేష్
నవతెలంగాణ-పాలకుర్తి
మత్స్యకారులకు చేప పిల్లలకు బదులు నగదు బదిలీ అందజేసి ప్రతి సొసైటీకి రూ 10 లక్షలు అందించాలని మత్స్యకారులు, మత్స్య కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి మునిగల రమేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈనెల 21న మత్స్యకారుల ప్రపంచ దినోత్సవం పురస్కరించుకొని జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ లో మత్స్య కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రాష్ట్ర సదస్సు వాల్ పోస్టర్ ను మంగళవారం మండలంలోని వల్మిడి లో వల్మీడీ సొసైటీ నాయకులతో కలిసి రమేష్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం మత్స్య కార్మిక సంఘం రాజీలేని పోరాటం చేస్తుందని తెలిపారు. మత్స్య కారులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడం జరుగుతుందని తెలిపారు, పెండింగులో ఉన్న ఎక్స్‌గ్రేషియా ఇన్సూరెన్స్ బిల్లులను వెంటనే అందజేయాలని, ప్రతి మండల కేంద్రంలో అధునాతనమైన ఫిష్ మార్కెట్ ఏర్పాటు చేసి చేపలకు మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్ చేశారు. ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం పురస్కరించుకొని ఈనెల 21 స్టేషన్ ఘన్పూర్ లో జరిగే రాష్ట్ర సదస్సుకు కేరళ రాష్ట్ర ఫెడరేషన్ చైర్మన్ వి మనోహరన్ స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, మత్స్యకార జాతీయ నాయకులు లెల్లెల బాలకష్ణ, రాష్ట్ర నాయకులు పాల్గొంటారని తెలిపారు. మత్స్యకారుల రాష్ట్ర సదస్సును జయప్రదం చేసేందుకు మత్స్యకారులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వల్మిడి మత్స్య పారిశ్రామిక సహకార సంఘం సీనియర్ నాయకులు నీరటి చంద్రయ్య, పంగ సైదులు, ఉప సర్పంచ్ నీరటి సోమయ్య, సొసైటీ అధ్యక్షులు మోకాటి కుమార్, కార్యదర్శి పిట్టల రాములు, డైరెక్టర్లు గంట శ్రీను, పిట్టల రామచంద్రు, బోయిని అశోక్, నీరటి సైదులు, పిట్టల అశోక్ తదితరులు పాల్గొన్నారు.