Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కిసాన్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు
- బొంపెల్లి దేవేందర్ రావు
నవతెలంగాణ-పర్వతగిరి
రైతులు పండించిన వరి ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు బొంపెల్లి దేవేందర్ రావు డిమాండ్ చేశారు. మండలంలోని గోపనపల్లి, అనంతారం గ్రామాల్లో మంగళవారం గోపనపల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మిట్టపెల్లి నాగార్జున ఆధ్వర్యం లో రైతుల వరికల్లాల వద్ద ధాన్యం రాశులను పరిశీలిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సుమారు 15 రోజులుగా రైతులు తమ పంట పొలాలను కోతలు కోసి దాన్యం రాశులు ఏర్పాటు చేసుకున్నారని, గ్రామాల్లో ఇప్పటివరకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాపోయారు. రైతుల ధాన్యం కుప్పలు ఎక్కడివి అక్కడే ఉన్నాయని, వాటిని ఆరబోయడానికి రోడ్ల వెంట నానా అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి ఎర్రబెల్లి సొంత మండలంలో రైతుల పరిస్థితి దారుణంగా ఉండడం విచారకరమన్నారు. వర్ధన్నపేట, పర్వతగిరి మండలాల్లో ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ఇప్పటివరకు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయించక పోవడం సిగ్గుచేటన్నారు. మంత్రులకు, ఎమ్మెల్యేలకు ఎన్నికల పైన ఉన్న ప్రేమ రైతులపై లేకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గోపనపల్లి కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు బెల్లం రాజు, అనంతారం గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పెర్వరం దేవేందర్, కాంగ్రెస్ కో అర్డినెట్స్ ఎండీ పాష, బెల్లం కుమారస్వామి, గోరంట్ల సావిత్రమ్మ, గడ్డం రాజశేఖర్, నాంపల్లి బిక్షపతి, బెల్లం కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.