Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పాఠశాల గేటు ఎదుట బాధితురాలి నిరసన
నవతెలంగాణ-తొర్రూరు
మహాత్మ జ్యోతిబాపూలే బాలుర బీసీ గురు కుల పాఠశాలలో తాత్కాలిక ప్రాతిపదికన పని చేస్తున్న కార్మికులను వేధింపులకు గురి చేస్తున్న ప్రిన్సిపాల్‌పై చర్యలు తీసుకోవాలని ప్రజాసం ఘాల నాయకులు డిమాండ్ చేశారు. స్థానిక బీసీ గురుకులంలో కొంతకాలంగా స్వీపర్ గా పనిచేస్తున్న దండె ఇందిర ాను అకాలంగా తొలగించడాన్ని నిరసిస్తూ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం డివిజన్ కేంద్రంలోని పాఠశాల ఎదుట ఆందోళన చేపట్టి వారు మాట్లాడారు. నాలుగేండ్లుగా స్థానిక బీసీ గురుకు లంలో పనిచేస్తున్న ఇందిరను అకాలంగా తొల గించడం సరైనది కాదన్నారు. ఆమె డెంగ్యూ అనారోగ్య కారణాల రీత్యా ఐదు రోజులు పాఠ శాలకు రాలేకపోతే ప్రిన్సిపాల్ ఆమెపై కక్ష కట్టి అప్పుడున్న ఏజెన్సీ తో మాట్లాడి ఆమెను తొలగించడం దారుణమని ఆరోపించారు. ప్రిన్సి పాల్ రవీందర్ మహిళా వర్కర్ల పట్ల జులుం ప్రదర్శిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. మూడు నెలల నుండి ప్రిన్సిపాల్ రవీందర్ రెడ్డి మళ్ళీ విధుల్లో చేర్చుకుంటానని చెప్పి మరో కార్మికురాలని చేర్చుకొని కాలయాపన చేస్తూ వచ్చారని అన్నారు. మహిళా కార్మికురాలు ఆర్థికంగా చితికిపోయి ఉందని, భర్త లేని ఆమెపై కుట్రపూరితంగా వ్యవహరించడం సమంజసం కాదని అన్నారు. బీసీ సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు స్పందించి విచారణ చేపట్టి ఆమెను విధుల్లోకి తీసుకుని న్యాయం చేయా లని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ తొర్రూరు మండల కార్యదర్శి జమ్ముల శ్రీనివాస్, విద్యార్థి సంఘాల జేఏసీ కన్వీనర్ బందు మహేందర్, కో కన్వీనర్ లు మాలోతు సురేష్ బాబు, ప్రతినిధులు బసన బోయిన రాజేష్ యాదవ్, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు లవిశెట్టి ప్రసాద్, పాఠశాల కార్మిక సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.