Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే రాజయ్య
నవతెలంగాణ - స్టేషన్ ఘనపూర్
నియోజక వర్గ అభివృద్ధికి సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందిస్తూ, ఏది అడిగినా కాదనక వరాల జల్లు కురిపిస్తున్నారని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే డా తాటికొండ రాజయ్య సంతప్తి వ్యక్తం చేశారు. నియోజకవర్గానికి ఫైర్ స్టేషన్ మంజూరైన సందర్భంగా గురువారం నియోజక వర్గ కేంద్రంలోని గాంధీ విగ్రహం వద్ద బాణసంచా పేల్చి, టీఆర్ఎస్ శ్రేణులతో కలిసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లాల పునర్విభజనలో భాగంగా కొత్త జిల్లాలు ఏర్పడిన తరుణంలో నియోజకవర్గంలో పరిపాలన సౌలభ్యం కోసం, ప్రజల సౌకర్యార్థం చిల్పూర్, వేలేరు కొత్త మండలాలు ఏర్పాటే గాకుండా, నియోజకవర్గ కేంద్రాన్ని రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటైందని అన్నారు. ఇటీవల కాలంలో 15 జిల్లాలకు మహాత్మ జ్యోతిరావు పూలే, మహిళా డిగ్రీ కళాశాల మంజూరీ అయిందని గుర్తు చేశారు. నియోజకవర్గ కేంద్రానికి వంద పడకల ఆసుపత్రి, పోస్ట్ మార్చురీ కేంద్రం, చిల్పూర్ గుట్ట దేవస్థాన అభివృద్ధికి ప్రత్యేక నిధులు ఇవ్వాలని సీఎంను కోరినట్లు చెప్పారు.