Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జనగామ
వికలాంగుల సమస్యలను పరిష్కరించేందుకు వారికి వికలాంగుల బంధు, బీమా పథకం ప్రకటించాలని ఎన్పిఆర్డి రాష్ట్ర అధ్యక్షులు కురెల్లి వెంకట్ డిమాండ్ చేశారు. గురువారం జనగామ పట్టణంలో ఎన్పిఆర్డీ జిల్లా సదస్సు జిల్లా ప్రధాన కార్యదర్శి బిట్ల గణేష్ అధ్యక్షతన ఏర్పాటు చేయగా ఈ సదస్సుకు సంఘం రాష్ట్ర అధ్యక్షులు కురెల్లి వెంకట్ ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడారు. వికలాంగులకు పెన్షన్ రూ. 10 వేలకు పెంచాలని డిమాండ్ చేశారు. వికలాంగుల సమస్యల సాధన కోసం ఎన్పిఆర్డీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ మొండి వైఖరికి వ్యతిరేకంగా పోరాటం చేస్తుందని, డిసెంబర్ 26, 27, 28 తేదీలలో హైదరాబాద్ నగరంలో ఎన్పిఆర్డీ అఖిల భారత మహాసభలు నిర్వహించడం జరుగుతున్నాయని ఈ మహాసభలకు జనగామ జిల్లా వ్యాప్తంగా పెద్దసంఖ్యలో వికలాంగులు తరలిరావాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో 20 లక్షల మంది వికలాంగులు ఉన్నారని వీరిలో కేవలం 4.83 లక్షల మందికి మాత్రమే పెన్షన్లు ఇస్తున్నారని అన్నారు. ధరల పెరుగుదలకు అనుగుణంగా వికలాంగుల పెన్షన్ 10వేలకు పెంచాలని డిమాండ్ చేశారు. జీవో నంబర్ 13 ప్రకారం రాష్ట్రంలో వికలాంగులకు ప్రత్యేక రేషన్ కార్డులు మంజూరు చేయాలని అన్నారు. రాష్ట్రంలో 91శాతం వికలాంగులు మాధ్యమిక విద్యాకు దూరంగా ఉన్నారని తెలిపారు. 60 శాతం స్కూల్ లలో ర్యాంపులు లేకపోవడంతో వికలాంగులు విద్యకు దూరం అవుతున్నారన్నారు. 21రకాల వైకల్యాల వారికి వైకల్య ధవీకరణ పత్రాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు పాముకుంట్ల చందు, జిల్లా కమిటీ సభ్యులు బండవరం శ్రీదేవి, మామిడాల రాజేశ్వరి, తోట సురేందర్, కొత్తపల్లి రమేష్, ఇట్టబోయిన మధు, నామాల రాజు, మోతే వెంకటమ్మ, తాడెం రాములు, పిట్టల కుమార్, ఆకారపు కుమార్, గొడుగు రాజవయ్య, పులి మంజుల, బైరగోని మహేష్, రడపాక యాదగిరి, మాలోతు రాజ్ కుమార్, మచ్చ వరలక్ష్మి, భూమా రజిత, రావులు శ్రీనివాస్, పులిగిల్ల రాజయ్య తదితరులు పాల్గొన్నారు.