Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భూమిపై తీసుకున్న రుణం చెల్లించాలని బ్యాంకర్ల ఒత్తిడి
నవతెలంగాణ-చిట్యాల
గత 50 ఏళ్లుగా సాగు చేస్తున్న పట్టా భూమిని అధికారులు ఆన్లైన్లో నమోదుచేయకుండా తొల గించడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టా డుతున్నారు. ఈ భూమిపై తీసుకున్న రుణం చెల్లిం చాలని బ్యాంకు అధికారులు హుకుం జారీ చేస్తుండ గా లబోదిబోమంటు విలపిస్తున్నారు. భూమిని సాగు చేసుకుంటూ జీవనోపాధి కొనసాగిస్తున్న రైతులపై ప్రభుత్వ అధికారులు కక్ష సాధింపుతో తమ పట్టా భూములు ఆన్లైన్లో తొలగించారని ఈ విషయమై అనేక సందర్భాల్లో రెవెన్యూ అధికారులకు జిల్లా కలెక్టర్ సంప్రదించడం జరిగింది అని మాకు ఎలాంటి న్యాయం జరగ లేదని వారు పేర్కొన్నారు బాధిత రైతులు తెలిపిన ప్ర కారం వివరాలు ఇలా ఉ న్నాయి మండలంలోని వ రికోలుపల్లి, కుమ్మరిపల్లె లోని రైతులు సమ్మయ్య , రవి, రాజయ్య, రాజు,శంక రాచారి లు మాట్లాడుతూ 50ఏళ్ల క్రితం ఈ ప్రాంత భూములు కొనుగో లు చేసుకుని పట్టా చేసుకొని వ్యవసాయంతో కుటుంబాలను పోషించుకుంటు న్నామని తెలిపారు. పట్టాపాస్బుకులతో చల్లగరిగా కాకతీయ గ్రామీణ బ్యాంకులోరుణాలు తీసుకుం టూ వ్యవసాయానికి పెట్టుబడి పెట్టుకుంటూ ప్రతి సంవ త్సరం రుణాలు చెల్లిస్తున్నామని తెలిపారు. గత మూ డేళ్ల క్రితం రెవెన్యూ అధికారులు తమ పట్టా భూము ల రికార్డులను పేర్లను ఆన్లైన్లో నుండి తొలగించారు. బ్యాంకు అధికారులు రైతులు తమ భూములు పెట్టి క్రాప్లోన్లు తీసుకోవడం జరిగిందని రుణాలు చెల్లిం చాలని అధికారులు ఒత్తిడి తీసుకువస్తూ ఇబ్బందులు పెడుతున్నారని పేర్కొన్నారు. ఈక్రమంలో క్రాప్ లోన్స్ వడ్డీ చెల్లించి రెన్యువల్ చేస్తామని బ్యాంకు కెళ్ళి అధికారులను ప్రాధేయపడితే వారు దానికి ఒప్పుకోకుండా మీ భూములు ఆన్లైన్లో లేవు కాబట్టి మీరు రెన్యూవల్ చేసుకోవడానికి అనర్హులు అని తెలి పారు. రుణం, వడ్డీ రూ.2 లక్షలు ఉందని వెంటనే చెల్లించాలని వారు చెప్పారన్నారు. తమ భూములు ఆన్లైన్లో ఉన్నప్పుడు బ్యాంకులు రుణాలు తీసుకున్నా మని గత మూడేళ్లుగా బ్యాంకు అధికారులు ఎలాంటి ఇబ్బందులకు గురి చేయలేదని తెలిపారు.
సం బంధిత జిల్లా అధికారులు స్పందించి తమ భూమిని ఆన్లైన్లో పునరుద్ధరించాలని అలాగే వడ్డీ మాఫీ చే యించాలని తమ భూములు తమకు ఇప్పించాలని రైతులు వేడుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో రైతులు సింగన వేణి రాజయ్య గోవిందుల రాజయ్య చంద్రమౌళి సాంబయ్య శంకరయ్య రంపిసరాజు తదితరులు పాల్గొన్నారు.