Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ములుగు
గురుకుల పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల కు వ్యాధులు సంక్రమించకుండా జాగ్రత్తలు తీసుకో వాలని, వ్యాధులపట్ల విద్యార్థులకు అవగాహన కల్పిం చాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ అల్లెం అప్పయ్య తెలిపారు. జిల్లాలోని జాకారం తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలుర రెసిడెన్షియల్ పాఠశాల జి ల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో గురువారం రెసిడె న్షియల్ స్కూల్లో విద్యార్థులకు వచ్చే వ్యాధుల నివా రణ గూర్చి అవగాహన కల్పించారు. ఈ సందర్బంగా డిఎంహెచ్ఓ ఆయన మాట్లాడుతూరెసిడెన్షియల్ పా ఠశాలలో ఉంటున్న విద్యార్థులకు వ్యాధులు రాకుం డా నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. వ్యా ధుల పట్ల అప్రమత్తంగా ఉండాల నర్సింగ్ కేర్ టేకర్స్ ను ఆదేశించారు. పాఠశాలల్లో విద్యార్థులు ఎవరైనా జబ్బు పడినట్లయితే వారికి ప్రత్యేకమైన నర్సింగ్ రూమ్ ఏర్పాటు చేయాలని మిగతావారితో కలవ కుండా ఐసోలేషన్ చేయాలని తద్వారా మిగతా వి ద్యార్థులకు వ్యాధి వ్యాపించకుండా ఉంటుందని ప్రిన్సి పాల్స్ని కోరారు. ఈ శిక్షణ కార్యక్రమంలో సాధార ణంగా పిల్లలలో వచ్చు చిరు వ్యాధులు దగ్గు, జలుబు జ్వరం, చర్మవ్యాధులు దంతాలకు సంబంధించిన వ్యాధులు చెవి, ముక్కు, గొంతు వాటి బారిన పడటం వాటికి చికిత్స, నివారణగూర్చి వివరించారు.
అత్యవసర సమయంలో ఉపయోగపడే మందు లను నర్సింగ్ కేర్‌టేకర్ సిబ్బంది అందుబాటులో ఉంచుకోవాలని తెలిపారు. ఈ శిక్షణ కార్యక్రమంలో డాక్టర్ శ్రీకాంత్, డాక్టర్ తేజ, డాక్టర్ జయప్రద, డాక్టర్ ఆంజనేయులు, డెమో తిరుపతి, సిహెచ్ఓ దుర్గారా వు, హెచ్ఈ సంపత్,భాస్కర్,కిరణ్, సతీష్ తదితరు లు పాల్గొన్నారు.