Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రాంసింగ్ జి పాటిల్
నవతెలంగాణ-ములుగు
ఆదివాసీ ప్రజల అభ్యున్నతికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించి ముందుకు సాగుతున్నట్లు జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రాంసింగ్ జీ పాటిల్ అన్నారు. జిల్లాలోని ఆ దివాసీ తెగలకు చలికాలం దృష్ట్యా బిర్సాముండా జయంతిని పురస్కరించుకుని జి ల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో దుప్పట్లు పంపిణీ చేసే వాహనాన్ని గురువారం జిల్లా ఎస్పీ జెండాఊపి ప్రారంభించి కొందరు ఆదివాసీలకు దుప్పట్లను అందించా రు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ భారత సమాజంలో ఆదివాసీ పాత్ర ఎంతో ఉందని వారు మన సమాజంలో భాగమని బిర్సా ముండా జయంతి సందర్బంగా ములుగు జిల్లాలోని అన్ని ఆదివాసీ గుత్తికొయా తెగల ప్రజలను చలికాలంలో ఆ దుకునే ఉద్దేశంతో నాణ్యమైన 2 వేల దుప్పట్లను పంచడం జరిగిందన్నారు. ఈ వారంలో అనేక ఆదివాసీ సంక్షేమ కార్యక్రమాలు పోలీస్ శాఖ తరపున చేపట్టడం జరిగిందన్నారు. దీనిలో భాగంగా పస్రా లోని పిఎస్అర్ గార్డెన్ లో చేపట్టిన ఉచిత మెగా మెడికల్ క్యాంపుకు భారీస్పందన లభించిందని సుమారు గా 1500 మంది, ఏటూరునాగారం ఉచిత మెడికల్ క్యాంపుకు 2000 మంది తరలివచ్చి అన్ని రకా ల పరీక్షలు చేయించుకొని మెడిసిన్స్ ఉచితంగా పొందారని ఇంకా రాబోవు కాలం లో ఆదివాసీ తెగల అభ్యున్నత్తికై అనేక కార్యక్రమాలు పోలీస్ శాఖ తరపున చేపడతాం అని చెప్పారు.
ఈ కార్యక్రమాలు ఇంత పెద్ద సఫలం కావడానికి ఓఎస్డి గౌస్ ఆలం,ఏఎస్పీ సుదీర్ అర్ కేకన్ ఆధ్వర్యంలో టీమ్స్ చేసిన కషి ఫలితంగానే ఈ కార్యక్రమాలు విజయవంతమయ్యాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ములుగు సీఐ రంజిత్ కుమార్,అర్ఐ రాధారపు స్వామి,డిఎస్బి2 సీఐ సార్ల రాజు, ఎస్సై లక్ష్మారెడ్డి, ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.