Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రెన్యువల్ సర్టిఫికెట్లు ప్రాధాన్యతతో మంజూరు చేయాలి
- లబ్ధిదారుల నుండి నగదు వసూలు చేస్తే కఠిన చర్యలు
- సమీక్షా సమావేశంలో జిల్లా కలెక్టర్ భవేష్మిశ్రా
నవతెలంగాణ-భూపాలపల్లి
జిల్లాలో దివ్యాంగుల ధవీకరణకోసం సదరం శిబిరాలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ భవేష్మిశ్రా అధికారులను ఆదేశించారు. గురువారం సదరం క్యాంపుల నిర్వహణపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లా డుతూ ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సదరం సర్టిఫికెట్లకు సంబంధించిన దరఖాస్తులు ఎక్కువగా వస్తున్నాయని, వీటిని మానవతా దక్పథంతో త్వరితగ తిన పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు. జిల్లాలో 6965మంది దివ్యాంగులకు ప్రభుత్వం ప్రతి నెల రూ.3016లు ఆసరాపెన్షన్ అందిస్తుందని, వీటిలో 724 మంది లబ్ధిదారులకు సకాలంలో సద రం సర్టిఫికెట్ రెన్యువల్ చేయకపోవడంతో పెన్షన్ నిలిచిపోయిందని అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రతి వా రం 3రోజులు 100స్లాట్ల చోప్పున సదెరం క్యాంపుల ను నిర్వహించి, రెన్యువల్ దరఖాస్తులు పూర్తి చేయా లని కలెక్టర్ ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా 2251 మందికి తాత్కాలిక సదరం సర్టిఫికెట్లు జారీ చేసామని, వాటిలో ఇప్పటికి 1205 మంది సర్టిఫికెట్ల గడువు ముగిసిందని, 22 మంది సర్టిఫికెట్లు గడువు డిసెంబర్నెలలో, 1043 మంది లబ్ధిదారుల గడువు వచ్చే సంవత్సరానికి ము గుస్తుందని, లబ్ధిదారులగడువు ముగిసేలోపు మరో సారి సదరం క్యాంపులో పరిశీలించి అర్హులైన వారికి రెన్యువల్ సర్టిఫికెట్లు వెంటనే మంజూరు చేయాల ని అధికారులను ఆదేశించారు. వారంలో 3 సార్లు సదెరం క్యాంపులు ప్రత్యేకంగా నిర్వహించి రెన్యువల్ దరఖాస్తులు పూర్తి చేయాలని, జిల్లా మొత్తం ఒకేసారి కాకుండా 3,4 మండలాలు కలిపి సదెరం క్యాంపులు నిర్వహించాలని సూచించారు. ప్రభుత్వం అందించే ఆసరా పెన్షన్ లబ్దిదారులకు చాలా కీలకంగా ఉం టుందని, అర్హులైన ప్రతిలబ్ధిదారుడికి ఆసరా పింఛ న్లు మంజూరు చేయడం మన బాధ్యత అని కలెక్టర్ అన్నారు. సదరం సర్టిఫికెట్ ల మంజూరు అంశంలో కోంత మంది అధికారులు అలసత్వం వహిస్తున్నా రని, దీనిని ఆసరాగా చేసుకుని మధ్యవర్తులు, డాక్టర్ లు, మీసేవా వారు డబ్బు వసూలు చేస్తున్నట్లు సమా చారం అందుతుందని వీరిపై కఠినచర్యలు తీసు కుం టామని కలెక్టర్ హెచ్చరించారు. సదరం సర్టిఫికెట్ లు జారీ కోసం ఎవరికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదని, ఎవరైనా డిమాండ్ చేస్తే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయాలని కలెక్టర్ పేర్కొన్నారు. సర్టిఫికెట్ ల మంజూరు సమయంలో వైద్య అధికారులు కొంత మానవతా దక్పథంతో పని చేయాలని, అర్హులైన వారికి త్వరగా సర్టిఫికెట్ జారీ చేయాలని, శారీరక వైకల్య శాతం ధవీకరణ సమయంలో స్వల్ప తేడాలు ఉన్న వారికి ఫించన్ రద్దు కాకుండా పరిశీలించి సర్టిఫికెట్ మంజూరు చేయాల సూచించారు.
ఈ సమావేశంలో డీఆర్డీఓ పురుషోత్తం, డిఎంహెచ్ఓ డాక్టర్ శ్రీరామ్, డిసిహెచ్ఎస్ డాక్టర్ సంజీవయ్య సంబంధించిన అధికారులు, డాక్టర్లు, తదితరులు పాల్గొన్నారు.