Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మహాముత్తారం
లాంపి స్కిన్ వ్యాధి పశువులకు సోకకుండా ప్రతి రైతు ఉచితంగా టీకాలు వేయించి, పశు సంప దను కాపాడుకోవాలని సర్పంచ్ దూలం మల్లయ్య గౌడ్ అన్నారు. గురువారం మండలంలోని ములుగు పల్లి గ్రామంలో మండల పశువైద్యాధికారి డాక్టర్ వెంకటేష్ ఆధ్వర్యంలో పశువులకు టీకాలు వేసే కార్యక్రమాన్ని నిర్వహించి రైతులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేసి మాట్లాడుతూ పశువులన్నింటికీ వ్యాధి నిరోధక టీకాలు వేయించి కాపాడుకోవాలన్నారు. గ్రామంలో ఉన్న 176 ఆవులకు, దూడలకు, ఎడ్లకు టీకాలు వేశారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్, రమేష్, సారయ్య, పోచయ్య, రైతులు పాల్గొన్నారు.