Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మండల విద్యాశాఖ నోడల్ అధికారి బి మహేష్నాయక్
నవతెలంగాణ-వేలేరు
విద్యార్థుల్లో చదువుతో పాటు సంస్కతి, సాంప్రదాయాలను పెంపొదించడం, భారతీయ కళలపై ఆసక్తిని కలిగించడానికి పాఠశాలలలోని 9 నుండి ఇంటర్ చదివే విద్యార్థుల్లోో కళానైపుణ్యాలను ప్రోత్సహించడానికి కళా ఉత్సవ్ - 2022 పోటీలను నిర్వహిస్తున్నట్లు మండల విద్యాశాఖ నోడల్ అధికారి బి మహేష్ నాయక్ తెలిపారు. విద్యార్థుల్లో మండల స్థాయి కళాఉత్సవ్ -2022 పోటీలు మండల విద్యావనరుల కేంద్రంలో గురువారం జరిగాయి. ఈ సందర్బంగా మహేష్ నాయక్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ, హన్మకొండ జిల్లా విద్యాశాఖ ఆదేశానుసారం పాఠశాలల స్థాయిలో విజేతలైన విద్యార్థులకు మండల స్థాయిలో 10 విభాగాలలో భారతీయ కళలపై పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలి పారు. విజేతలకు జిల్లా స్థాయి పోటీలకు పంపించడం జరుగుతుందన్నారు. పోటీలలో జెడ్పిహెచెస్(వేలేరు), ఎర్రబెల్లి, (పీచర), కేజీబీవీ, టీిఎస్ఆర్ఈఐఎస్(వేలేరు) తదితర పాఠశాలల విద్యార్థులు జిల్లా స్థాయి పోటీల కు ఎంపికయ్యారన్నారు. వేలేరు జెడ్పిహెచెస్ హెచ్ఎం నాగకుమారి, ఉపాద్యాయులు పి ఉమాదేవి, పీచర జెడ్పీిహెచెస్ ఉపాధ్యాయులు శ్రీహరి, కేజీబీవీ ఎస్ఓ శ్రవంతి, సీఆర్పీలు శ్రీనివాస్,రాజ్ కుమార్, పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.