Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎంపీపీ ఎర్రబెల్లి మాధవి
నవతెలంగాణ-నెల్లికుదురు
చిన్నపిల్లలకు లోపల పోషణ నివారణ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఎంపీపీ ఎర్రబెల్లి మాధవి నవీన్‌రావు ఎంపీడీవో శేషాద్రి, మండల ప్రత్యేక అధికారి సూర్య నారాయణ, సీడీపీఓ హైమావతి తెలిపారు మండల కేంద్రంలోని రైతు వేదిక భవనంలో గురువారం సర్పంచ్‌లు, కార్యదర్శులు, ఏఎన్ ఎంలు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లకు మండలస్థాయి అవగాహన కార్యక్రమాన్ని నిర్వ హించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... అంగన్వాడీ కేంద్రాలు పిల్లల ఎదుగుదల పై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి పౌష్టికాహార అందిస్తుందని అన్నారు. దీనిని గ్రామస్థాయిలో అంగన్వాడీ టీచర్లు వారికి వచ్చే సరుకులను సక్రమంగా అందించాలని అన్నారు. పిల్లల ఎదుగుదలపై ప్రత్యేక దష్టి సారించాలని అన్నారు. ప్రతి పిల్లవాళ్ళు వయసుకు తగ్గ బరువు ఉండాలని, పిల్లలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ పౌష్టికాహారాన్ని అం దిస్తున్నారన్నారు. సర్పంచ్ బీరవెల్లి ఎంపీటీసీ వేన్నాకుల వాణి శ్రీనివాస్ సిడిపిఓ హైమావతి గూడూరు సిడిపిఓ నీలోఫర్ అజ్మీ ఏసీడీపీఓ ఇందిరా, సూపర్వైజర్లు మల్లీశ్వరి గౌస్య కవిత జ్యోతి స్థానిక వైద్యాధికారి అన్వేష్ హెచ్ఈఓ వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.
విజ్ఞానవంతులుగా తీర్చిదిద్దాలి
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను విజ్ఞాన వంతులుగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమైందని ఎంపీపీ ఎర్రబెల్లి మాధవి నవీన్ రావు, కాంప్లెక్స్ హెచ్ఎం షాగంటి స్వామి అన్నారు. మండలంలోని మేషరాజు పల్లి ఆలేరు మునిగేలవేడు ప్రభుత్వ పాఠశాలలో కాంప్లెక్స్ సమావేశాన్ని గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులకు పాఠ్యాంశాలపై పట్టు సాధించేందుకు ఉపాధ్యాయులు వినూ త్నమైన పద్ధతులను పాటించాలన్నారు. కాంప్లెక్స్ సమావేశంలో ఉపాధ్యాయులు తయారుచేసిన బోధనో ఉపకారణాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రతి విద్యార్థి కష్టపడి చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని సూచించారు. సర్పంచ్ వెలిశాల లక్ష్మీదేవేందర్రావు, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు చాగంటి స్వామి, ఖలీల్ అహ్మద్, టి గంగాధర్, వెంకటేశ్వర్లు, ఉపాధ్యాయులు, సీఆర్పీలు కవిత, జే కవిత, భాస్కరరావు , వీరస్వామి పాల్గొన్నారు.