Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మండల అభివృద్ధి కమిటీ చైర్మన్
- వెనుకదాసుల రామచంద్రయ్యశర్మ
నవతెలంగాణ-పెద్దవంగర
తొర్రూరు లయన్స్ క్లబ్ అందిస్తున్న సేవలు అభినందనీయమని మండల అభివృద్ధి కమిటీ చైర్మన్ వెనుకదాసుల రామచంద్రయ్య శర్మ అన్నారు. గురువారం మండల కేంద్రంలోని శ్రీరామ్ అప్పయ్య స్మారక భవన్ లో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత షుగర్, బీపీ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. సమాజంలోని అట్ట డుగు వర్గాలకు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పలు సేవలు అందుతున్నాయని ఆయన అన్నారు. న్నారు. గతంలో లయన్స్ క్లబ్ పలు సేవా కార్యక్రమాలు చేపట్టేదని, ఇటీవల వైద్య సేవలు సైతం అందించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. రాబోయే కాలంలో లయన్స్ క్లబ్ సేవలను ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు, పేద ప్రజలకు భారీ ఎత్తున సేవా కార్యక్రమాలు చేపట్టాల న్నారు. లయన్స్ క్లబ్ జోన్ ఛైర్మన్ ప్రతాపని వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. షుగర్ రహిత సమాజ స్థాపన లయన్స్ క్లబ్ లక్ష్యమన్నారు. అందులో భాగంగానే డివిజన్ పరిధిలోని అనేక గ్రామాల్లో ఉచిత షుగర్, బీపీ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. షుగర్ వ్యాధి గురించి ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, క్రమం తప్పకుండా పరీక్షలు చేసుకుంటూ, ఆహార నియమాలు పాటించాలన్నారు. కాగా గ్రామంలో 126 మందికి పరీక్షలు నిర్వహించగా, 35 మందికి షుగర్ వ్యాధి నిర్ధారించినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో రీజియన్ సెక్రటరీ దామెర సరేష్, క్లబ్ అధ్యక్షుడు మాదారపు వేణుగోపాల్, నాళ్ళ కష్ణమూర్తి, తమ్మి రమేష్, గొట్టిముక్కుల శ్రీనివాస్ రెడ్డి, యాదవ సంఘం నాయకుడు నిమ్మల శ్రీనివాస్, పుల్లయ్య, సాయి, వెంకన్న, కారోబార్ కుమారస్వామి పాల్గొన్నారు.