Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - డోర్నకల్
తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర రెండో మహాసభలను జయప్రదం చేయాలని సంఘం మండల నాయకులు కోరారు. గురువారం తెలంగాణ సాయుధ పోరాట గడ్డ ఉయ్యాల వాడ బొడ్రాయి సెంటర్లో సంఘం జెండాను తాళ్లూరి యాదయ్య ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మండల నాయకులు జక్కుల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ... రైతు సంఘం రాష్ట్ర మహాసభలు నవంబర్ 27, 28, 29 తేదీలలో నల్లగొండ పట్టణంలో జరగబోతు న్నాయని అన్నారు. కిసాన్ సభ ఆల్ ఇండియా అధ్యక్షులు అశోక్ దావలే, ప్రధాన కార్యదర్శి హన్నాను మొల్ల హాజరవుతున్నారని సంఘం ప్రతినిధులు పాల్గొనున్నారని అన్నారు. రైతుల ధరణ, సాగునీటి, మార్కెట్ సమస్యలు మద్దతు ధరలు భూ పరిహారం తదితర సమస్యలపై చర్చించి భవిష్యత్తులో పోరాటాలకు రూప కల్పన చేయబోతున్నామని తెలిపారు. జిల్లాలో వరి కొనుగోలు కేంద్రాలు నత్తనడకన సాగుతు న్నాయని, జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాలలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి మద్దతు ధరకు కొనుగోలు చేయాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా పోడు రైతులకు హక్కు పత్రాలు ఇవ్వడం కోసం సర్వేలు తూతూ మంత్రంగా సాగుతున్నాయని అన్నారు. గ్రామసభల ద్వారా నిజమైన లబ్ధిదారులకు హక్కు పత్రాలు వెంటనే ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం మండల నాయకులు దాసరి మల్లేశం, సంకటి బాబు, తాళ్లూరి వెంకన్న, గ్రామ రైతులు రాజుల వెంకయ్య, మండపల్లి రవీందర్ ,దాసరి రంగయ్య, పగిడిపాల వెంకట్రావ్, దాసరి చంద్రమ్మ, బసనబోయిన దానమ్మ, నాయకులు ఉప్పనపల్లి శ్రీనివాస్ ,నవాబ్ , వీరభద్రం రైతులు పాల్గొన్నారు.