Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- పరకాల
సీసీ రోడ్లతో వారులు అభివృద్ధి చెందుతున్నా యని మున్సిపల్ చైర్పర్సన్ సోదా అనిత రామకృష్ణ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 14వ ఆర్థికసంఘం నిధులు కేటాయించడంతో గురువారం పట్టణంలోని విలీన గ్రామమైన సీతారాంపురం గోపువాడలో సీసీ రోడ్ల పనులకు ఆమె శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా స్థానిక ఏడవ వార్డు కౌన్సిలర్ నల్లెల జ్యోతి -అనిల్ పూజ చేసి పనులు ప్రారంభించారు . అనంతరం మున్సిపల్ చైర్పర్సన్ మాట్లాడుతూ పట్టణ అభివృద్ధిలో భాగంగా విలీన గ్రామాలు సైతం అభివృద్ధి చెందాలనే ఆకాంక్షతో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఆదేశానుసారం ప్రతి వార్డులో సీసీ రోడ్లను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ప్రజాభివృద్ధి ప్రభుత్వ శ్రేయస్సుగా ప్రతి ఒక్కరూ అభివృద్ధి పనులకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్‌చైర్మన్ రేగురి జైపాల్ రెడ్డి , వ్యవసాయ మార్కెట్ చైర్మన్ సారంగపాణి, స్థానిక కౌన్సిలర్లు ఉమా రఘుపతి గౌడ్, దామెర మొగిలి ,అడప రాములు, ఏకు రాజు, స్థానిక నాయకులు ,కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.