Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కమలాపూర్
దక్షిణ మధ్య రైల్వే సికింద్రబాద్ జనరల్ మేనేజర్ అరుణ్‌కుమార్ జైన్ శుక్రవారం వార్షిక తనిఖీలు నిర్వహించారు. ఇందులో భాగంగా కాజీపేట నుంచి జమ్మికుంట సెక్షన్ మధ్య గల 15వ నెంబర్ రైల్వే గేట్‌ను ఉన్నతాధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. గేట్ పరిసర ప్రాంతాన్ని, గేట్మెన్ గదిని, లెవల్ క్రాసింగ్‌ను ఆయన క్షుణ్ణంగా తనిఖీ చేశారు. విధుల్లో ఉన్న గేట్‌మెన్‌ను వృత్తిపరమైన పలు ప్రశ్నలు అడిగారు. అన్నింటికీ సరైన సమాధానాలు చెప్పిన గేట్‌మెన్‌ను ఈ సందర్భంగా జీఎం అభినందించి పలు సూచనలు చేసారు. కార్యక్రమంలో డీఆర్ఎం ఏకే గుప్తా, రైల్వే ఉన్నతాధికారులు, ఆర్పీఎఫ్ పోలీసులు, సిబ్బంది పాల్గొన్నారు.