Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తొర్రూరు
పీఎం ఈజీపి పథకం ద్వారా ఉపాధి కల్పన పొంది యువత కలలను సహకారం చేసుకుని భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగాలని జిల్లా కలెక్టర్ కె శశాంక అన్నారు. శుక్రవారం తొర్రూర్ డివిజన్ కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర కళామండపంలో జిల్లా పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ కె శశాంక ముఖ్యఅతిథిగా విచ్చేసి మాట్లాడుతూ ఈ ప్రాంతంలో స్వయం ఉపాధి కల్పన కొరకు సూక్ష్మ లగు మరియు మధ్య తరహా పరిశ్రమల ను స్థాపించుకొని ఆర్థికంగా బలోపేతం చెందాలని అన్నారు. తయారీ రంగ పరిశ్రమలకు 50 లక్షల వరకు మరియు సేవా రంగ పరిశ్రమలకు 20 లక్షల వరకు బ్యాంకు రుణం పొందే అవకాశం ఉందని ప్రాజెక్టు వ్యయంలో 30శాతం వరకు సబ్సిడీ వర్తిస్తుందని, లబ్ధిదారుని వాటా ప్రాజెక్టు వ్యాయాయంలో ఐదు శాతం నుండి 10 శాతం వరకు పొందవచ్చునని, నూతనంగా స్థాపించు సూక్ష్మత రహ పరిశ్రమలకు మాత్రమే రుణ సదుపాయం ఉంటుందని కలెక్టర్ తెలిపారు. గ్రామీణ, పట్టణాల్లో 18 సంవత్సరాలు పైబడిన వారు 5 లక్షలకు పైబడిన వ్యయం కలిగిన ప్రాజెక్టులకు కనీస విద్యార్హత 8వ తరగతి ఉంటుందని ఆదాయ పరిమితి లేదని మరింత సమాచారం కొరకు జిల్లా పరిశ్రమల కేంద్రం వారిని సంప్రదించాలని తెలిపారు. కులాలకు అతీతంగా స్కీం వర్తిస్తుందని, ఆర్థికంగా ఎదిగి సమస్యలను నిలదొక్కుకోవాలని కలెక్టర్ అన్నారు. జిల్లావ్యాప్తంగా మూడు అంకెల సంఖ్య కు పైగా అప్లికేషన్లు వచ్చే విధంగా అధికారులు, ప్రజా ప్రతినిధి చొరవ తీసుకోవాలని యువతను ప్రోత్సహించాలని అన్నారు. అనంతరం మరింత అవగాహన కొరకు ఖాదీ మరియు గ్రామీణ పరిశ్రమల కమిషన్ పత్రాలు, గోడపత్రికలను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సదస్సులో జడ్పిటిసి శ్రీనివాస్, మున్సిపల్ చైర్మన్ రామచంద్రయ్య, పిఎసిఎస్ చైర్మన్ కాకిరాల హరి ప్రసాద్, ఇండిస్టీస్ జిఎం సత్యనారాయణ, ఈడీ బాలరాజు, ఆర్డీవో ఎల్ రమేష్, తహసిల్దార్ రాఘవరెడ్డి, మున్సిపల్ కమిషనర్ గుండె బాబు , ఎల్ డి ఎం సత్యనారాయణమూర్తి పాల్గొన్నారు.