Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మహబూబాబాద్
అనారోగ్యం బాధితులకు అండగా సీఎంఆర్ ఉంటుందని ఎంపీ మాలోత్ కవిత అన్నారు. మహబూబాబాద్ ఎంపీ క్యాంపు కార్యాలయంలో ఎంపీ కవిత 26 మంది లబ్ధిదారులకు 10 లక్షల రూపాయల 32 వెయిల 500 విలువగల చెక్కులను పంపిణీ చేశారు. చరిత్రలో కనీ విని ఎరగని నీతిలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం అనారోగ్యంతో ఆసుపత్రిపాలై అప్పుల పాలైన బాధితులకు అండగా సీఎంఆర్ ఎఫ్ రిలీఫ్ ఫండ్ ఉంటుందని అన్నారు. వెంకన్న గౌడ్, జడ్పీ కో ఆప్షన్ మహబూబ్ పాషా మురళీధర్ రెడ్డి, కొత్తగూడ పార్టీ అధ్యక్షులు వేణు, భూక్య ప్రవీణ్ నాయక్ పొన్నాల యుగేందర్ మానాది రాజేష్ పాల్గొన్నారు.