Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జనగామ
జనగామ పట్టణంలోని డివేడర్ల మధ్య నాటిన కొనోకార్పస్ చెట్లతో ప్రజల ఆరోగ్యానికి ముప్పు ఉందని వాటిని వెంటనే తొలగించాలని సిపిఎం పట్టణ కార్యదర్శి జోగు ప్రకాష్ డిమాండ్ చేశారు. శుక్రవారం జనగామ స్థానిక సిపిఎం ఆఫీసులో పట్టణ కమిటీ సభ్యులు బాల్నె వెంకట మల్లయ్య అధ్యక్షతన జరిగిన సమావేశంలో సిపిఎం జనగామ పట్టణ కార్యదర్శి జోగు ప్రకాష్ పాల్గొని మాట్లాడారు. జనగాంలో అడుగడుగునా కోనోకార్పస్ మొక్కలు(విషపు మొక్కలు) వీటినే బార్బోసా జాతి మొక్కలు అని అని చెబుతారు అన్నారు. వీటి ద్వారా ప్రజల ఆరోగ్యం చెడిపోవడమే కాకుండా పర్యావరణానికి పెనం ముప్పు వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేశాడు విషపూరితమైన కనోకార్పస్ మొక్కలు విచ్చలవిడిగా నాటడం వల్ల శ్వాస సంబంధ రోగాలు,ఎలర్జీ ,ఇతర చర్మ వ్యాధులు పెద్ద ఎత్తున ప్రబలే అవకాశం ఉందన్నారు. ఇప్పటికే కొన్ని చోట్ల ప్రజల నుండి విమర్శలు వస్తున్నాయన్నారు. జనగామలో ఇప్పటికైనా విషపూరిత కనోకార్పాస్ చెట్లను తొలగించి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే బాధ్యత, అధికారుల పై ప్రజా ప్రతినిధి మున్సిపల్ చైర్మన్ పై ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ కమిటీ సభ్యులు ఎండి అజారుద్దీన్, కళ్యాణం లింగం, పందిళ్ళ కళ్యాణి, పల్లెల లలిత, దూసరి నాగరాజు, చీర రజిత, కొండ వరలక్ష్మి, భాషపాక విష్ణు, మారేడు వినోద్, కళ్యాణం, కళ్యాణ్ వెంకటేష్, ఎండి, మైవెళ్లి, అంజయ్య, గుండె మల్లేష్, చింత బాబు పాల్గొన్నారు.