Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
నవతెలంగాణ- తొర్రూర్ రూరల్
నా 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలకు చేసినన్ని మంచి పనులు మరెవరూ చేయడం చూడలేదని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివద్ధి మరియు గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి శ్రీ ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. మండలంలోని నాంచారి మడూర్ గ్రామంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల ప్రారంభోత్సవంలో పాల్గొని 30 ఇళ్లను లబ్ధిదారులకుఅందించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనవల్ల లబ్ధిదారులు పొందిన ఒక్కో ఇంటి విలువ దాదాపు 25 లక్షల రూపాయలు ఉందన్నారు కేసీఆర్ చేస్తున్న మంచి పనులను గుర్తించి ఆయనకు అందరూ బాసటగా నిలబడాలని కోరారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ శశాంక మాట్లాడుతూ డబుల్ బెడ్ రూం ఇండ్లు తొర్రూరు లోనే బాగా జరుగుతున్నాయి అని లబ్ది దారులకు శుభాకాంక్షలు తెలియజేశారు. మిగిలిన చోట్ల కంటే పాలకుర్తి లో ఎక్కువగా మంజూరు అయి నిర్మాణం పూర్తి చేసుకుంటున్నాయి. కార్యక్రమంలో సభాధ్యక్షులుగా సర్పంచ్ గుంటక యాద లక్ష్మి, కలెక్టర్ శశాంక, జెడ్పీటీసి మంగళపల్లి శ్రీనివాస్,మార్కెట్ కమిటీ చైర్మన్ పసుమర్తి శాంత, ప్యాక్స్ చైర్మన్ హరి ప్రసాద్, మున్సిపల్ చైర్మన్ మంగళపల్లి రామచంద్రయ్య, పాలకుర్తి దేవస్థాన కమిటీ అధ్యక్షులు రామచంద్రయ్య శర్మ, ఎంపీపీ అంజయ్య, ఎంపీటీసీలు, నాయకులు పాల్గొన్నారు.